Home గాసిప్స్ రజినీది గెస్ట్ రోల్ అనుకున్నాం…కాదట….అసలు మ్యాటర్ చెప్పిన డైరెక్టర్!

రజినీది గెస్ట్ రోల్ అనుకున్నాం…కాదట….అసలు మ్యాటర్ చెప్పిన డైరెక్టర్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ జైలర్(Jailer Movie) సెన్సేషనల్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన తర్వాత సినిమా లాల్ సలామ్(Lal Salaam Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయ్యి రజినీకాంత్ కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీగా నిలిచింది…

సినిమా డైరెక్టర్ అయిన రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ రీసెంట్ గా సినిమా ఫేల్యూర్ పై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు…అందులో భాగంగా రజినీ రోల్ గురించి మాట్లాడుతూ ముందు సినిమాలో నాన్న గారి రోల్ 10 నిమిషాలు మాత్రమె ఉండగా సెకెండ్ ఆఫ్ లో ఆ రోల్ ఎంటర్ అవుతుందని, కానీ నాన్నకి కథ చెప్పిన తర్వాత…

కథ నచ్చడంతో తన రోల్ లెంత్ ఎంతైనా పర్వాలేదు అని చెప్పడంతో సినిమాలో అసలు హీరోల కథ తగ్గి రజినీ స్క్రీన్ స్పేస్ పెరుగుతూ పోయిందని, దాంతో కథ ఎటు నుండి ఎటో వెళ్ళిన ఫీలింగ్ కలగగా రిలీజ్ కి 2 రోజుల ముందు వరకు కూడా ఫైనల్ ఔట్ పుట్ ని కూడా కరెక్ట్ గా చూసుకోలేక్ పోయాయమని చెప్పుకొచ్చారు…

రజినీది స్పెషల్ రోల్ గా అనుకుని చివరికి మెయిన్ రోల్ గా మారడం, అసలు కథలో ఉన్న ఎమోషన్ మిస్ అవ్వడం వలనే సినిమా ఫెయిల్ అయ్యిందని తప్పు ఒప్పుకున్నారు… కానీ ఆ ఓవరాల్ గా రజినీ స్పెషల్ రోల్ కి ఒప్పుకోవడం డేట్స్ ఎక్కువ ఇవ్వడం వలన కథ మార్చామని చెబుతూ ఉండటంతో….

ఇప్పుడు తప్పు రజినీదా అని చెప్పే ప్రయత్నం జరుగిందని సోషల్ మీడియాలో అనుకుంటున్నారు… ఏది ఏమైనా కూడా జైలర్ లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ తర్వాత రజినీ నుండి ఎవ్వరూ ఊహించని సినిమా లాల్ సలామ్ అని చెప్పొచ్చు. దాంతో ఔట్ రేట్ డిసాస్టర్ గా నిలిచింది ఆ సినిమా.. ఇక రజినీ వేటయ్య సినిమాతో ఈ ఇయర్ ఎండ్ టైం కి ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here