Home న్యూస్ జెర్సీ Vs కాంచన3….5 వ రోజు కలెక్షన్స్ రిపోర్ట్!

జెర్సీ Vs కాంచన3….5 వ రోజు కలెక్షన్స్ రిపోర్ట్!

517
0

  సమ్మర్ న్యూ మూవీస్ జెర్సీ మరియు కాంచన 3 రెండూ మంచి వసూళ్ళ తో దూసుకు పోతున్నాయి. కాగా రెండు సినిమాల్లో కాంచన 3 4 రోజుల లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ ని అధిగమించగా, జెర్సీ వేట ని కొనసాగిస్తుంది, కాగా జెర్సీ బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో 4 వ రోజు తో పోల్చితే 5 వ రోజు డ్రాప్స్ ఎక్కువగానే ఉన్నాయి, కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల కి సినిమా బాగానే హోల్డ్ చేసింది.

సినిమా మొత్తం మీద 5 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో 1.5 కోట్ల నుండి 1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే చాన్స్ ఉందని చెప్పొచ్చు. ఆఫ్ లైన్ టికెట్ లెక్కలను బట్టి ఈ లెక్క పెరగడమో తగ్గడమో జరుగుతుంది. ఇక మరో సినిమా కాంచన 3…

బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి మాస్ సెంటర్స్ లో బాగా హోల్డ్ చేసి 1.4 కోట్ల నుండి 1.6 కోట్ల మధ్యలో షేర్ ని అందుకునే దిశగా అడుగులు వేస్తుంది, మొత్తం మీద రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ళ తోనే రోజుని ముగించాయి అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here