Home న్యూస్ మహేష్(8)..ఎన్టీఆర్(6)..నాని(6)

మహేష్(8)..ఎన్టీఆర్(6)..నాని(6)

802
0

     నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ జెర్సీ ఇక్కడ కన్నా ఓవర్సీస్ లో ఓ రేంజ్ లో రేచ్చిపోతూ దూసుకు పోతుంది, క్లాస్ సినిమా అవ్వడం రివ్యూ లు ఓ రేంజ్ లో ఉండటం తో ఓవర్సీస్ ఆడియన్స్ థియేటర్స్ కి ఎగబడి సినిమాను చూస్తున్నారు, దాంతో సినిమా 5 రోజులలోనే ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ ని అందుకుంది, దాంతో టాలీవుడ్ హీరోలలో ఓవర్సీస్ లో ఎక్కువ సార్లు 1 మిలియన్ ని అందుకున్న హీరోల్లో నాని మూడో హీరో అయ్యాడు.

అక్కడ ఎవ్వరికీ అందనంత ఎత్తులో మహేష్ బాబు 8 సినిమాలతో ఉన్నాడు, దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, ఆగడు, 1 నేనొక్కడినే, శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, స్పైడర్ మరియు భరత్ అనే నేను అక్కడ 1 మిలియన్ ని అందుకున్నాయి, ఇక రెండో ప్లేస్ లో..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 6 సినిమాలతో టాప్ 2 ప్లేస్ ని అక్కడ కైవసం చేసుకున్నాడు, బాద్ షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ మరియు అరవింద సమేత సినిమాలు అక్కడ 1 మిలియన్ మార్క్ ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు నాని 3 హీరోగా అక్కడ 6 సినిమాలతో 1 మిలియన్ ని అందుకున్నాడు.

నాని నటించిన సినిమాలలో ఈగ, భలే భలే మొగాడి వోయ్, జెంటిల్ మ్యాన్, నేను లోకల్, నిన్ను కోరి మరియు జెర్సీ సినిమాలు అక్కడ 1 మిలియన్ మార్క్ ని పూర్తీ చేసుకున్నాయి. ఎలాంటి స్టార్ బ్యాగ్ డ్రాప్ లేకుండా ఓవర్సీస్ లో ఇన్ని మిలియన్ మూవీస్ ని సొంతం చేసుకుంది.

టాప్ స్టార్స్ లో ఒకడిగా ఓవర్సీస్ లో టాప్ 3 లో ఒకడిగా నిలిచాడు నాని, జెర్సీ జోరు చూస్తుంటే ఫైనల్ రన్ లో అక్కడ 1.5 మిలియన్ ని అందుకునే అవకాశం కూడా గట్టిగానే ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here