Home న్యూస్ డే 2 టార్గెట్…2.5 కోట్లు…రెండో రోజు జెర్సీ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

డే 2 టార్గెట్…2.5 కోట్లు…రెండో రోజు జెర్సీ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

996
0

 

   నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ జెర్సీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద 7.55 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా రెండో రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ లెవల్ లోనే ఓపెన్ అయింది, కాగా మొదటి రోజు తో పోల్చుకుంటే ఓవరాల్ డ్రాప్స్ మార్నింగ్ అండ్ నూన్ షోల కి 15 టు 20% ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి 25% వరకు ఉందని చెప్పాలి.

సినిమా ఏ సెంటర్స్ లో జోరు అద్బుతంగా ఉండగా బి సి సెంటర్స్ లో మాత్రం డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నా అది అనుకున్న రేంజ్ లో అయితే లేదు, పూర్తీ క్లాస్ మూవీ అవ్వడం తో ఆ ఎఫెక్ట్ పడింది అని చెప్పాలి. సీడెడ్ లో డ్రాప్స్ మాత్రం ఏకంగా 50% కన్నా ఎక్కువ ఉన్నాయి.

మంచి సినిమాను జనాలు ఎక్కువ సంఖ్య లో ఆదరించక పొతే ఇలాంటి ఎమోషనల్ సబ్జెక్ట్స్ రావడం మరింత తగ్గుతుంది, మరి జనాలు ఇది గమనించి రానున్న రోజుల్లో సినిమాను మరింత ఆదరిస్తారో లేదో చూడాలి. ఇక సినిమా రెండో రోజు ఓవరాల్ షేర్ మినిమమ్ 2.5 కోట్ల రేంజ్ లో…

వచ్చే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే, అలాగే IPL మ్యాచుల ఎఫెక్ట్ పడకుండా ఉంటె సినిమా ఓవరాల్ గా 2.7 కోట్ల నుండి 2.9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు, ఇక సినిమా ఓవర్సీస్ లో హాల్ఫ్ మిలియన్ మార్క్ ని అందుకోగా ఓవరాల్ గా సినిమా..

2 వ రోజు వరల్డ్ వైడ్ గా 4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మంచి రివ్యూలు రావడం తో ఓవర్సీస్ జోరు మరింత దుమ్ము లేపే విధంగా వీకెండ్ మొత్తం మీద ఉండే అవకాశం ఉంది, ఇక సినిమా 2 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here