Home గాసిప్స్ ఎన్టీఆర్30….ఇది నిజమైతే రచ్చ ఖాయం!!

ఎన్టీఆర్30….ఇది నిజమైతే రచ్చ ఖాయం!!

858
0

ఇంకా ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కానీ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ గురించిన విషయాలు సోషల్ మీడియా లో లీక్ అవుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా ఇప్పుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో అరవింద సమేత వీర రాఘవ తర్వాత రూపొందుతున్న సినిమా “అయినను పోయి రావలె హస్తినకు” సినిమా గురించిన వార్తలు రిలీజ్ అవుతూనే ఉండగా ఇప్పుడు మరో న్యూస్ చక్కర్లు కొడుతుంది.

India's Biggest Birthday Trend Record Belongs To #HappyBirthdayNTR

ఆ వార్తా ఏంటంటే ఎన్టీఆర్30 వ సినిమా లో ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ లో ఒకరైన మంచు మనోజ్ కీలక పాత్ర పోషించబోతున్నారు అని, ఆ కీలక పాత్ర ఏంటి అంటే సినిమా లో మెయిన్ విలన్ రోల్ ని మంచు మనోజ్ చేయబోతున్నారని అంటున్నారు. ఇప్పటి వరకు హీరో రోల్స్ తప్ప…

వేరే రోల్స్ వేయని మంచు మనోజ్ తన క్లోజ్ ఫ్రెండ్స్ లో ఒకరైన ఎన్టీఆర్ సినిమా కోసం ఈ రోల్ ని చేయబోతున్నారు అని గత కొన్ని రోజులుగా టాక్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. కానీ ఈ వార్తల పై ఇంకా నిజానిజాలు తెలియాల్సి ఉండగా…

ఒకవేళ నిజం అయితే మాత్రం ఇద్దరూ పోటాపోటిగా నటించడం ఖాయమని చెప్పొచ్చు. ఇద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడం తో ఈ సినిమా ఒక మెమరబుల్ మూవీ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉంటుంది, అలాగే త్రివిక్రమ్ సినిమాల్లో ఇలా వేరే హీరోలను కూడా తీసుకోవడం ఇదివరకు చాలా సినిమాల్లో మనం ఆల్ రెడీ చూసే ఉన్నాం…

కాబట్టి నిజం అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మంచు మనోజ్ భారీ బడ్జెట్ తో అహం బ్రహ్మాస్మి అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తో పాటు ఈ సినిమా కూడా చేసే అవకాశం లేకపోలేదు అంటున్నారు. ఇక ఎన్టీఆర్30 సినిమా ఈ ఇయర్ దసరా కి మొదలు కాబోతుండగా వచ్చే ఇయర్ సెకెండ్ ఆఫ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here