బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో అసలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా కాంతార… గట్టిగా చెప్పాలి అంటే కేజిఎఫ్ సినిమా నిర్మాతల నుండి వస్తున్న సినిమా అని తెలిసినా అందులో ఉన్న హీరో పేరు కూడా ఎవ్వరికీ తెలియకుండా చాలా సైలెంట్ గా రిలీజ్ అయిన కాంతార సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఇప్పుడు కేజిఎఫ్ సినిమా పార్ట్ 1…..
తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని కూడా బీట్ చేసి సంచలన బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. 2018 టైం లో కూడా కేజిఎఫ్ పార్ట్ 1 పెద్దగా అంచనాలు లేకుండానే రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో ఏకంగా 13.1 కోట్ల రేంజ్ లో…
షేర్ ని సొంతం చేసుకుని కన్నడ నుండి తెలుగు లో డబ్ అయిన మూవీస్ లో బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేయగా తర్వాత కేజిఎఫ్ 2 వచ్చి రికార్డుల బెండు తీసింది. ఇక ఇప్పుడు తెలుగు రిలీజ్ కి ముందు కన్నడలో సంచలనాలు సృష్టించినా కానీ తెలుగు లో..
2 వారాల తర్వాత డబ్ అయ్యి రిలీజ్ అయిన ఈ సినిమా వర్కౌట్ అవుతుందో లేదో అన్న డౌట్ ఉన్నా ఇప్పుడు 9 రోజుల్లో 13.8 కోట్లకు పైగా షేర్ ని అందుకుని ఇప్పుడు లైఫ్ టైం లో 20 కోట్లకు పైగా షేర్ ని అందుకునే అవకాశం ఉందనిపించేలా దూసుకు పోతుంది ఈ సినిమా…