కొన్ని కొన్ని సార్లు చిన్న సినిమాలు అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర కానీ టెలివిజన్ లో కానీ దుమ్ము లేపుతూ ఉంటాయి. అలాంటి కోవలోకే వస్తుంది ఈ ఇయర్ టాలీవుడ్ లో రిలీజ్ అయిన డబ్బింగ్ చిన్న సినిమా కనులు కనులను దోచాయంటే… థియేటర్స్ లో సైలెంట్ గా రిలీజ్ అయ్యి ఎవ్వరూ పట్టించు కోక పోవడం తో థియేటర్స్ నుండి తొలగించబడి… తిరిగి మౌత్ టాక్ తో దుమ్ము లేపుతూ…
థియేటర్స్ ని భారీగా పెంచుకుంటూ దూసుకు పోతున్న తరుణంలో కరోనా ఎఫెక్ట్ వలన పరుగును మధ్యలోనే ఆపేసినా తెలుగు లో బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు కూడా మంచి రేటింగ్ ని దక్కించుకుని దుమ్ము లేపింది.
సినిమా తెలుగు బిజినెస్ 80 లక్షలు అయితే కోటి రేంజ్ షేర్ ని వసూల్ చేసిన ఈ సినిమా టెలివిజన్ రైట్స్ కోటి కి అటూ ఇటూగా అమ్ముడు పోగా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడే 7.1 TRP రేటింగ్ ని దక్కించుకోగా… తర్వాత రీసెంట్ గా రెండో సారి టెలికాస్ట్ అవ్వగా…
ఈ సారి కొంచం తగ్గ ఓవరాల్ గా 3.94 TRP రేటింగ్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా… సినిమా ను కొన్న రేటు కి సినిమా అటు బాక్స్ ఆఫీస్ దగ్గర కానీ ఇటు టెలివిజన్ లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పొచ్చు. మౌత్ టాక్ పాజిటివ్ గా ఉండటం సినిమా కి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.
టెలివిజన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాను ఇష్టపడుతున్నారని చెప్పాలి. అందుకే సినిమా కి ఇలాంటి రేటింగ్స్ దక్కుతున్నాయి. కరోనా ఎఫెక్ట్ లేకుండా ఉంటె సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మరింత మంచి విజయాన్ని కలెక్షన్స్ ని సాలిడ్ గా సొంతం చేసుకుని ఉండేది. కానీ తమిళ్ లో మలయాళంలో మాత్రం సినిమా అద్బుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది…