ఈ ఇయర్ ఇండియా వైడ్ గా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమాల లిస్టు లో ముందు నిలిచే సినిమా KGF చాప్టర్ 2… 2018 ఎండింగ్ లో వచ్చిన మొదటి పార్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు ఎలాంటివో అందరికీ తెలిసిందే, చాలా సైలెంట్ గా రిలీజ్ అయ్యి ఎబో యావరేజ్ రేంజ్ రివ్యూ లను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అన్ని చోట్లా ఊచకోత కోసింది.
దాంతో సినిమా సెకెండ్ పార్ట్ కోసం టోటల్ ఇండియా ఎంతో ఆశగా ఎదురు చూడటం మొదలు పెట్టింది, ఇక రెండో పార్ట్ రిలీజ్ డేట్ ని ఈ ఇయర్ అక్టోబర్ 23 న అనౌన్స్ చేయగా ప్రస్తుతం లాక్ డౌన్ వలన సినిమా షూటింగ్ ఆగిపోగా…
అనుకున్న సమయానికి సినిమా వస్తుందా లేదా అన్న డౌట్ ఉండగా యూనిట్ లోకల్ చానెల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ విశేషాలు తెలియజేసిందట, ఆ న్యూస్ ప్రకారం సినిమా షూటింగ్ ఇప్పుటి వరకు 80% కి పైగా జరిగిందని సమాచారం. ఇంకో 25 రోజుల షూటింగ్ మాత్రమె బాలెన్స్ ఉందని యూనిట్ చెబుతుంది.
అందులో 2 యాక్షన్ సీన్స్ చిత్రీకరించాలట, అందులో ఒకటి సంజయ్ దత్ తో యష్ కి ఉండే ఫైట్ సీన్ అని అంటున్నారు..అవన్నీ కర్ణాటక లోనే షూటింగ్ చేయబోతున్నట్లు సమాచారం. టాకీ పార్ట్ టోటల్ 98% పూర్తీ అయిందని యూనిట్ చెబుతుంది, దాంతో ఈ లాక్ డౌన్ ఎఫెక్ట్ పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టె అవకాశం లేడని చెబుతూనే…
ముందుగా అనౌన్స్ చేసినట్లే అనుకున్న సమయానికే అక్టోబర్ 23 న బాక్స్ ఆఫీస్ దగ్గర KGF చాప్టర్ 2 ఊచకోత కోయడం ఖాయమని కన్ఫాం చేశారట యూనిట్. దాంతో ఈ ఇయర్ మిగిలిన పెద్ద సినిమాలు వచ్చినా రాకున్నా KGF చాప్టర్ 2 మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర జనాలను తిరిగి థియేటర్స్ వైపు భారీ సంఖ్య లో తెప్పించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు…