Home గాసిప్స్ తమిళనాడు లో బ్లాక్ బస్టర్…ఇక్కడ రీమేక్…బయపడుతున్న ఆడియన్స్!

తమిళనాడు లో బ్లాక్ బస్టర్…ఇక్కడ రీమేక్…బయపడుతున్న ఆడియన్స్!

777
0

     ఒక భాష లో హిట్ అయిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అవ్వడం సజహమే. ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలు తెలుగు లో రీమేక్ పేరుతొ హిట్ అయినవి పక్కకు పెడితే ఫ్లాఫ్ అయినవే ఎక్కువ అని చెప్పాలి. గబ్బర్ సింగ్ మరో ఒకటి రెండు సినిమాలు మినహాహిస్తే మిగిలిన సినిమాలు అన్నీ బొక్క బోర్లా పడినవే. ఇక రీసెంట్ గా మరో రీమేక్ ని టాలీవుడ్ కి తీసుకు రావాలని చూస్తున్నారు.

చూడటం ఏంటి ఆల్ మోస్ట్ రీమేక్ కన్ఫాం అయిపోయి త్వరలో నే రిలీజ్ కూడా కానుంది. ఆ సినిమా మరేదో కాదు తమిళ్ లో గత ఏడాది సెన్సేషనల్ హిట్ గా నిలిచి సస్పెన్స్ థ్రిల్లర్ స్టొరీ లలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా నిలిచినా రాక్షసన్ సినిమా.

అండర్ డాగ్ గా బరిలోకి దిగి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా మాస్టర్ ప్రింట్ వచ్చిన వెంటనే సినిమా సోషల్ మీడియా క్రేజ్ చూసి తెలుగు ఆడియన్స్ చాలా మంది ఒరిజినల్ ని చూశేశారు కూడా. అలాంటి సినిమాను ముందుగా నితిన్ తో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు.

కానీ కొన్ని కారణాల వల్ల ఆ రీమేక్ ఆగిపోగా ఇప్పుడు లైన్ లోకి బెల్లంకొండ శ్రీనివాస్ ఎంటర్ అయ్యాడు, కెరీర్ లో తొలి హిట్ కోసం ఎదురు చూపులు కొనసాగిస్తున్న బెల్లం కొండ ఈ సినిమా తో హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు, కానీ డైరెక్టర్ గా రమేష్ వర్మ ని ఎంచుకున్నాడు.

ఈయన నుండి హిట్ వచ్చి చాలా కాలమే అవుతుంది, దాంతో సినిమా ఒరిజినల్ వర్షన్ ని చూసిన ఆడియన్స్ ఫ్లాఫ్ హీరో ఫ్లాఫ్ డైరెక్టర్ కలిసి చేస్తుండటంతో ఒరిజినల్ వర్షన్ ని చెడగోడతారేమో అని భావిస్తున్నారు. మరి చెడగోడతారో లేక బ్లాక్ బస్టర్ హిట్ కొడతారో చూడాలి. సినిమా ఆగస్టు 2 న రిలీజ్ కానుంది… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here