అసలు రిలీజ్ అవుతుందో లేదో అన్న డౌట్స్ లో ఉన్న సినిమా చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా రిలీజ్ అవ్వడం ఒకెత్తు అయితే రిలీజ్ అయిన తర్వాత సూపర్ హిట్ టాక్ తో దూసుకు పోతూ కలెక్షన్స్ పరంగా సెన్సేషన్ ని క్రియేట్ చేయడం అన్నది మరో ఎత్తుగా చెప్పుకోవాలి… రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన కోలివుడ్ స్టార్ హీరో శింభు నటించిన లేటెస్ట్ మూవీ మానాడు విషయంలో ఇదే జరిగింది.
ఈ సినిమా పై అంచనాలు అయితే డీసెంట్ గా ఉన్నాయి కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సజావుగా రిలీజ్ అవుతుందో లేదో అన్న డౌట్స్ ఉండేవి, ఇక రిలీజ్ అవ్వదు అనుకున్న చివరి నిమిషంలో ఎలాగోలా సేఫ్ అయ్యి రిలీజ్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ టాక్ ని దక్కించుకుని…
బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపేలా దూసుకు పోతూ 4 రోజుల్లోనే కంప్లీట్ గా ప్రాఫిట్ జోన్ లో ఎంటర్ అయ్యి ఇప్పుడు సూపర్ లాభాలతో దుమ్ము లేపుతుంది. ఈ సినిమాను తమిళనాడు లో 13 కోట్ల రేటు కి అమ్మగా వరల్డ్ వైడ్ గా 18 కోట్ల రేటు కి అమ్మారు.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో టోటల్ ఇండియాలో 31.2 కోట్ల గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 41 కోట్ల గ్రాస్ ను అందుకుంది. 5 రోజులు పూర్తీ అయ్యే టైం కి తమిళనాడులో 33.5 కోట్ల గ్రాస్ ను టోటల్ ఇండియాలో 34 కోట్ల గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా 45 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.
అందులో షేర్ ఆల్ మోస్ట్ 23 కోట్ల రేంజ్ లో ఉండగా 4 రోజుల్లో క్లీన్ హిట్ అయిన సినిమా 5 రోజల్లో ఇప్పుడు ఆల్ మోస్ట్ 5 కోట్ల ప్రాఫిట్ ను ఆల్ రెడీ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. లాంగ్ రన్ లో సినిమా ఇంకా అల్టిమేట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని, శింభుకి ఇది తమిళ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని అంటున్నారు.