బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలం అవుతున్న శర్వానంద్, తెలుగు లో చాలా కాలంగా సినిమా చేయని సిద్దార్థ్ లు కలిసి చేస్తున్న లేటెస్ట్ మూవీ మహా సముద్రం బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవ్వగా సినిమా ఓవరాల్ గా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 13.5 కోట్ల రేంజ్ లో జరగగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం సినిమా…
14 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం తో బరిలోకి దిగుతూ ఉండగా సినిమా ఓవరాల్ థియేటర్ కౌంట్ వివరాలు ఇప్పుడు రిలీజ్ అయ్యాయి. సినిమా నైజాం ఏరియాలో 210 థియేటర్స్ లో రిలీజ్ కానుండగా సీడెడ్ ఏరియాలో 110 థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది.
ఇక ఆంధ్ర రీజన్ లో 240 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో 560 థియేటర్స్ లో రిలీజ్ కన్ఫాం అవ్వగా ఫస్ట్ డే 600 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోవచ్చు. ఇక మిగిలిన చోట్ల థియేటర్స్ తో కలిపి వరల్డ్ వైడ్ గా 750 వరకు థియేటర్స్ లో…
రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల ముందే మొదలు అవ్వగా క్లాస్ సెంటర్స్ లో బిలో యావరేజ్ గా మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించే విధంగా సాగుతున్నా ఓవరాల్ గా మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టాక్ బాగుంటే షో షోకి కలెక్షన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు.
ప్రజెంట్ బుకింగ్స్ అండ్ ఫస్ట్ డే హోల్డ్ ని అంచనా వేస్తె సినిమా మొదటి రోజు 2.5-3 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే ఛాన్స్ ఉంది, ఇక టాక్ బాగుండి కలెక్షన్స్ ఇంప్రూవ్ అయితే లెక్క షో షోకి పెరగొచ్చు. ఇక ఆంధ్రలో 100% పర్మీషన్ ఆల్ మోస్ట్ ఇచ్చినట్లే అంటున్నారు, అది కూడా అమలులోకి వస్తే కలెక్షన్స్ ఇంకా జోరు చూపోచ్చు.