Home న్యూస్ ఇక కష్టమే అనుకున్నా….కల్కిని తట్టుకుని 100 కోట్ల సింహాసనం ఎక్కినా విజయ్ సేతుపతి!

ఇక కష్టమే అనుకున్నా….కల్కిని తట్టుకుని 100 కోట్ల సింహాసనం ఎక్కినా విజయ్ సేతుపతి!

0

తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి పేరున్న యాక్టర్స్ లో ఒకరైన విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా వచ్చిన లేటెస్ట్ మూవీ మహారాజ(Maharaja Movie) యునానిమస్ రివ్యూలతో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపే కలెక్షన్స్ తో పరుగును కొనసాగించగా విజయ్ సేతుపతి కెరీర్ లోనే…

ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది…ఇక రెండు వారాలు పూర్తి అయ్యే టైంకే 90 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా ప్రభాస్(Prabhas) కల్కి2898AD(Kalki2898AD Movie)మూవీ రిలీజ్ వలన ఇక స్లో అయ్యి ప్రతిష్టాత్మక 100 కోట్ల గ్రాస్ ను ఇక అందుకోవడం కష్టమే అని…

అందరూ అనుకున్నారు. తమిళ్ లో కల్కి ఓకే అనిపించే స్టార్ట్ తర్వాత పాజిటివ్ టాక్ పవర్ హెల్ప్ తో మంచి జోరుని చూపించడంతో మహారాజ సినిమా స్లో అయినా కూడా కలెక్షన్స్ స్టడీగా నే ఉండగా ఎట్టకేలకు ఆల్ మోస్ట్ 3 వారాలు కంప్లీట్ అయ్యే టైంకి సినిమా..

ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లోనే ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని విజయ్ సేతుపతి కెరీర్ లో 50 వ సినిమాతో 100 కోట్ల రికార్డ్ సొంతం అయ్యేలా చేసింది. మొత్తం మీద సినిమా 20 రోజులు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….

Maharaja 20 Days Total World Wide Collections
👉Tamilnadu – 49.85Cr
👉Telugu States- 13.00Cr
👉Ka+ROI – 13.10Cr
👉Overseas – 24.25Cr***
Total WW collection – 100.10CR(48.40CR~ Share) Approx

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 27 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కల్కి ఊపులో ఈ సినిమా 100 కోట్ల మైలురాయిని ఇక అందుకోలేదు అనుకున్నా పాజిటివ్ టాక్ పవర్ తో ఆ మార్క్ ని దాటేసింది సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here