టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ మహర్షి, కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ సెన్సేషనల్ మూవీ పై అంచనాలు మాత్రం పీక్స్ లో ఉన్నాయి, భారీ క్రేజ్ నడుమ రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు సమ్మర్ కానుకగా రాబోతున్న విషయం తెలిసిందే, కాగా సినిమా అఫీషియల్ టీసర్ రిలీజ్ డేట్ ఇంకా కన్ఫాం కాక పోయినా కానీ ఏప్రిల్ లో..
ఉగాది కానుకగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు, ఇక సినిమా బిజినెస్ పరంగా ఇప్పటి నుండే జోరు చూపుతుంది అని చెప్పొచ్చు. మహేష్ కి ఇక్కడ ఎలాంటి క్రేజ్ ఉందొ ఓవర్సీస్ మార్కెట్ లో కూడా అదే రేంజ్ క్రేజ్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.
భరత్ అనే నేను తో అక్కడ కూడా సెన్సేషనల్ రికార్డులను నమోదు చేసిన మహేష్ ప్రతిష్టాత్మక 25 వ సినిమా అవ్వడం తో నిర్మాతలు సినిమా బిజినెస్ పరంగా అమెరికాలో మహర్షి కి మినిమం రేట్లు 19 కోట్ల నుండి 20 కోట్ల దాకా రావాలని చూస్తున్నారట. కానీ రీసెంట్ టైం లో కొన్ని సినిమాల వలన భారీ గా లాస్ అయిన బయ్యర్లు…
ఆ రేంజ్ లో కొనడానికి సిద్ధంగా లేరని తెలుస్తుంది. బయ్యర్లు ఈ సినిమా కోసం 14 కోట్ల నుండి 16 కోట్ల మధ్యలో కోట్ చేస్తున్నారట. ఆ మొత్తం ఓకే అయితే సినిమా అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 3.5 మిలియన్ మార్క్ దాకా వసూల్ చేస్తే సరిపోతుంది.
20 కోట్ల దాకా అయితే ఏకంగా 4.5 మిలియన్స్ ని వసూల్ చేయాల్సి ఉంటుంది, దాంతో బయ్యర్లు పైన చెప్పిన కోట్ కి సిద్ధంగా ఉన్నారట. ఇక నిర్మాతలు ఒకే అంటే ఇదే టార్గెట్ కన్ఫాం అవుతుంది అని చెప్పొచ్చు. మరి ఎం జరుగుతుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.