Home న్యూస్ మహర్షి ట్రైలర్ రివ్యూ…120 కోట్ల బొమ్మ!!

మహర్షి ట్రైలర్ రివ్యూ…120 కోట్ల బొమ్మ!!

0

     టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి సినిమా అఫీషియల్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది, ట్రైలర్ కి ఓవరాల్ గా వస్తున్న రెస్పాన్స్ పాజిటివ్ గా ఉందని చెప్పాలి. ఇక ట్రైలర్ లో ఆకట్టుకున్న అంశాల గురించి చెప్పాలి అంటే, మహేష్ కాలేజ్ స్టూడెంట్ లుక్ కొంచం మిస్ ఫెయిర్ అయింది అనిపించింది, కానీ బిజినెస్ మాన్ లుక్ అలాగే వ్యవసాయం చేసే టప్పటి లుక్స్ ఆకట్టుకున్నాయి.

ట్రైలర్ లో ఫ్రెండ్ షిప్, లవ్, ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్, ఒక వ్యక్తి బిజినెస్ లో ఎదగడం, తర్వాత వ్యవసాయం విలువ తెలుసుకోవడం ఇలా అనేక అంశాలను టచ్ చేస్తూ ఆకట్టుకున్నాడు దర్శకుడు, దేవి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా వరకు ప్లస్ అయింది.

ఇక ట్రైలర్ లో ఎక్కువగా ఆకట్టుకున్న అంశం ఫైట్ సీన్స్, చాలా కాలంగా ఇంటెన్స్ ఫైట్ సీన్స్ కి దూరంగా ఉన్న మహేష్ మహర్షి లో కుమ్మేశాడు అని చెప్పాలి. ఆ ఫైట్ సీన్స్ సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ గా మారతాయి అనడం లో ఎలాంటి డౌట్ లేదనే చెప్పొచ్చు.

ఇక అల్లరి నరేష్ తో ఫ్రెండ్ షిప్ సీన్స్ ఆకట్టుకోగా, చివర్లో వచ్చే మహర్షి థీం సాంగ్ బిట్ కూడా ఆకట్టుకుంది, మొత్తం మీద మహర్షి ట్రైలర్ అంచనాలను అందుకుందా లేదా అంటే మాత్రం కచ్చితంగా అందుకుందనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు నాలుగు వారల పాటు ఎలాంటి పోటి…

లేక పోవడం తో ఏమాత్రం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ ఇది 110 కోట్ల నుండి 120 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకునే బొమ్మగా కనిపిస్తుంది. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఎంతవరకు అంచనాలను తట్టుకుని ఈ కలెక్షన్స్ ని అందుకోగలుగుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here