Home న్యూస్ మలయాళంలో మరో బ్లాక్ బస్టర్…..వరుస పెట్టి హిట్స్ కొడుతున్నారుగా!

మలయాళంలో మరో బ్లాక్ బస్టర్…..వరుస పెట్టి హిట్స్ కొడుతున్నారుగా!

0

ఈ ఇయర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో కొన్ని సినిమాలు ఆకట్టుకోగా టాలీవుడ్ రెండు మూడు మంచి హిట్స్ ను సొంతం చేసుకుంది. తమిళ్ వాళ్ళు ఇంకా జోరు పెంచాల్సి ఉండగా బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు ఆకట్టుకుంటూ ఉన్నాయి. కానీ మలయాళ ఇండస్ట్రీ నుండి మాత్రం వరుస పెట్టి…..

మంచి మంచి సినిమాలు వస్తూ ఉండగా వరుస పెట్టి హిట్ మూవీస్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా రచ్చ చేస్తున్నారు….రీసెంట్ టైంలో టోవినో థామస్ నటించిన అన్వేషణ, తర్వాత మమ్ముట్టి భ్రమయుగం, ప్రేమలు అనే చిన్న సినిమాలు వరుస పెట్టి హిట్ మూవీస్ గా నిలవగా రీసెంట్ గా మరో సినిమా అక్కడ ఆడియన్స్ ను…..

ఓ రేంజ్ లో ఆకట్టుకుంటూ దుమ్ము లేపుతుంది…ఆ సినిమానే మంజుమ్మేల్ బాయ్స్ అనే సినిమా…. కొంత మంది ఫ్రెండ్స్ ఒక ట్రిప్ కోసమని ఒక ఫారెస్ట్ కి వెళితే అక్కడ అనుకోకుండా జరిగిన కొన్ని పరిస్థితుల నేపధ్యంలో రియల్ గా జరిగిన కొన్ని ఇంసిడెంట్ లను బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందించగా….

సినిమాకి అక్కడ యునానిమస్ రెస్పాన్స్ సొంతం అవ్వగా ఓపెనింగ్స్ కూడా ఓ రేంజ్ లో కుమ్మేస్తూ దూసుకు పోతుంది. దాంతో మలయాళ ఇండస్ట్రీకి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సొంతం అవ్వగా బాక్ టు బాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ కొడుతూ ప్రస్తుతానికి ఇండియన్ మూవీస్ లో ఎక్కువ హిట్ మూవీస్ తో…

మలయాళ ఇండస్ట్రీ ఫుల్ జోష్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం….భ్రమయుగం ఆల్ రెడీ డబ్ వర్షన్ ఇక్కడ రిలీజ్ అవ్వగా త్వరలో ప్రేమలు ఈ మంజుమ్మేల్ బాయ్స్ సినిమాలు తెలుగు లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు….అన్ సీజన్ లో మలయాళ ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ ను ఈ రేంజ్ లో షేక్ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here