మలయాళంలో లాస్ట్ నెలలో ఆడియన్స్ ముందుకు వచ్చి అల్టిమేట్ రెస్పాన్స్ తో ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మలయాళ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన సినిమా మంజుమ్మేల్ బాయ్స్(Manjummel Boys Telugu Review), అల్టిమేట్ రికార్డులను క్రియేట్ చేసిన ఈ సినిమా తెలుగు లో ఎట్టకేలకు రీసెంట్ గా రిలీజ్ అయింది…. తెలుగు లో సినిమా ఎలా అనిపించిందో తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ కి వస్తే 2006 టైంలో కేరళలో గ్యాంగ్ గా ఉండే కొందరు ఫ్రెండ్స్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మంజుమ్మేల్ టీం అనే పేరు వస్తుంది…వాళ్ళు అందరూ తమిళనాడులో కొడైకెనాల్ కి టూర్ కి వెళతారు…అన్ని తిరిగి చూసి చివర్లో నిషిద్ద ప్రాంతం అయిన గుణ కేవ్స్ కి వెళతారు…అక్కడ అనుకోకుండా ఒక ఫ్రెండ్ ఇరుక్కుంటాడు…
ఆ లోయలో పడిన వాళ్ళు తిరిగి సేఫ్ అవ్వడం అన్నది అప్పటికి జరగలేదు…మరి మిగిలిన ఫ్రెండ్స్ తమ స్నేహితుడిని కాపాడుకున్నారా లేదా అన్నది అసలు కథ… సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కథ టేక్ ఆఫ్ అవ్వడానికి కొంత టైం పట్టినా మనం కూడా ఆ ఫ్రెండ్స్ జర్నీలో టైం గడుస్తున్న కొద్దీ జాయిన్ అవుతాం…
ఎప్పుడైతే ఒకరు ఆ లోయలోకి పడిపోతారో అప్పటి నుండి తను సేఫ్ అయ్యాడా లేడా అన్న క్యూరియాసిటీతో ఆడియన్స్ సీట్ ఎడ్జ్ లో కూర్చుని సినిమా చూస్తారు…కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా….నేటివిటీ కొంచం డిఫెరెంట్ అయినా కూడా కోర్ పాయింట్ అండ్ డైరెక్టర్ ఎక్స్ లెంట్ టేకింగ్ తో తెరపై నటులు మనకు పెద్దగా పరిచయం లేక పోయినా కూడా మనం వాళ్ళతో ఇన్వాల్వ్ అవుతాం…
అందరూ ఎక్స్ లెంట్ గా పెర్ఫార్మ్ చేశారు…బ్యాగ్రౌండ్ స్కోర్ ఎక్స్ లెంట్ గా వర్కౌట్ అవ్వగా తెలుగు డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు….టేక్ ఆఫ్ కి కొంచం పట్టినా కూడా వన్స్ అసలు కథ మొదలు అయిన తర్వాత టైం అస్సలు తెలియకుండా ఆసక్తితో సినిమా చూస్తాం…. మొత్తం మీద రీసెంట్ టైంలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ లో ఈ సినిమా ఒకటి అని చెప్పొచ్చు.
వీకెండ్ లో ఫ్రీ టైంలో కచ్చితంగా ఈ సినిమాకి వెళ్లి చూడండి…ఏమాత్రం అంచనాలు లేకుండా వెళ్ళినా ఎంతో కొంత అంచనాలతో వెళ్ళినా కూడా సినిమా ఎండ్ అయ్యే టైంకి ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్స్ బయటికి రావడం మాత్రం ఖాయమని చెప్పొచ్చు…