మిస్టర్ మజ్ఞు ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా ఫట్టా!!

0
1077
Mr Majnu Overseas Review
Mr Majnu Overseas Review

    అఖిల్ అక్కినేని నటించిన మూడో సినిమా మిస్టర్ మజ్ను… తొలి రెండు సినిమాలు కొంత కలెక్షన్స్ వైస్ నిరాశ పరచడం తో అంచనాలు ఆశలు అన్నీ మూడో సినిమా పై పెట్టుకున్న అఖిల్ అన్నీ పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా ఈ సినిమా ని సెట్ చేసుకుని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు, ముందుగా సినిమా ఓవర్సీస్ ప్రీమియర్ షోల ని కంప్లీట్ చేసుకుని అక్కడ నుండి తొలి టాక్ ఏంటో బయటికి వచ్చేసింది.

ఆ టాక్ ప్రకారం సినిమా కథ పాయింట్ టోటల్ గా రివీల్ చేయక పోయినా కానీ ఎక్కువ కాలం లవ్ చేయడానికి ఇష్టపడని హీరో కి లాంగ్ లైఫ్ లవ్ కోరుకునే హీరోయిన్ ఎదురు అవ్వడం తో కథ ఎలాంటి టర్న్ తీసుకుంది అన్నది ఓవరాల్ పాయింట్ అని అంటున్నారు.

కొంచం ఆరెంజ్ పోలికలు ఉన్నప్పటికీ డిఫెరెంట్ నరేషన్ తో ఆకట్టుకున్న సినిమా మొదటి అర్ధభాగం అదిరి పోయే లెవల్ లో ఉంటుందని అంటున్నారు, లవ్ స్టొరీ, కామెడీ సీన్స్ అండ్ యాక్షన్ సన్నివేశాలకు తోడూ సంగీతం కూడా అదిరిపోయింది అంటున్నారు.

దాంతో ఫస్టాఫ్ మొత్తం ఒకే టెంపో లో దుమ్ము లేపగా మంచి పాయింట్ తో ఇంటర్వల్ తర్వాత సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచినప్పటికీ సెకెండ్ ఆఫ్ స్లో నరేషన్ తో కొంత ఇబ్బంది పెట్టినా ఫైనల్ గా ఎబో యావరేజ్ గా సినిమా ముగుస్తుంది అంటున్నారు.

ఫైనల్ గా సినిమా ఎబో యావరేజ్ టు హిట్ కి మధ్య లో ఉందని చెబుతున్నారు. ఇది ఓవర్సీస్ నుండి వినిపిస్తున్న టాక్. ఇక రెగ్యులర్ షోల టాక్ ఎలా ఉంటుందో అన్నది ఆసక్తి కరంగా మారింది, టాక్ ఇలానే ఉన్నా కలెక్షన్స్ సాలిడ్ గా రావడం ఖాయమని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!