సుదీర్ బాబు హీరోగా బిజీ గా ఉన్న సమయంలోనే నిర్మాత అవతారం ఎత్తి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ నన్ను దోచుకుందువటే….టీసర్ అండ్ ట్రైలర్ లతో మంచి ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని పాజిటివ్ బజ్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా.
దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ పరంగాను కుమ్మేసింది ఈ సినిమా. రెండు తెలుగు రాష్ట్రాలలో తో పాటు వరల్డ్ వైడ్ గా కూడా సాలిడ్ బిజినెస్ ని సొంతం చేసుకుంది. సినిమా నైజాంలో 2 కోట్లు, సీడెడ్ లో 1 కోటి టోటల్ ఆంధ్రాలో 2.5 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకుంది…
ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 50 లక్షలు…ఓవర్సీస్ లో 1 కోటి బిజినెస్ ని సాధించిన ఈ సినిమా టోటల్ గా 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని అందుకుంది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కి సినిమా మినిమమ్ 8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.