యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) హాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ నుండి చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరుస్తూనే ఉండటం విచారకం అనే చెప్పాలి. హిందీలో ఆశలు పెట్టుకున్న లాల్ సింగ్ చడ్డా సినిమా కూడా….
తీవ్రంగా నిరాశ పరచగా తెలుగు లో చేసిన థాంక్ యు(Thank You Movie) అలాగే ఈ ఇయర్ లో చేసిన కస్టడీ(Custody Movie) రెండూ కూడా అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యి బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ నాగ చైతన్య ఖాతాలో పడ్డాయి.
ఆ ఇంపాక్ట్ సోలో హీరోగా నాగ చైతన్య రీసెంట్ మూవీస్ కలెక్షన్స్ పై కూడా పడగా, మజిలీ(Majili) మరియు లవ్ స్టొరీ(Love Story) మూవీస్ రెండూ కూడా భారీ విజయాలను అందుకున్న తర్వాత కంప్లీట్ గా తర్వాత సినిమాలు నిరాశ పరిచాయి… ఒకసారి రీసెంట్ టైం లో…
నాగ చైతన్య నటించిన సోలో 5 మూవీస్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉#Custody – 7.20CR*****
👉#ThankYou – 4.45Cr
👉#LoveStory – 35.08CR
👉#Majili- 40.23Cr
👉#Savyasachi- 11.17Cr
Total Last 5 Movies collections: 98.13CR
Average 1 Movie Collections: 19.62Cr
మొత్తం మీద లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ లెక్క 98 కోట్ల మార్క్ నే అందుకోగా బాక్ టు బాక్ డిసాస్టర్స్ వలన యావరేజ్ గా ఇప్పుడు ఒక్క సినిమాకి 19.62 కోట్ల షేర్ అందుకునే అవకాశం ఉంది. ఇక ఫ్యూచర్ మూవీస్ తో మాత్రం నాగ చైతన్య సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.