Home న్యూస్ 23 కోట్ల సినిమా వల్ల కానిది….4 కోట్ల సినిమా చేసి చూపింది!!

23 కోట్ల సినిమా వల్ల కానిది….4 కోట్ల సినిమా చేసి చూపింది!!

0

OTT ప్లాట్ ఫాం లో ఒక సినిమా కి మరో సినిమా పెద్దగా పోటి ఏమి ఇవ్వదు కానీ జనాల్లో సినిమాను మరింత జొచ్చుకు పోయేలా చేయడం చాలా ముఖ్యం, అలా చేస్తేనే జనాలు ఎక్కువ గా సినిమా ను చూస్తారు. కరోనా టైం లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని చాలా సినిమాలు సొంతం చేసు కోగా తెలుగు లో ఒక రోజులో 2 సినిమాలు రిలీజ్ అవ్వగా రీసెంట్ గానే జరిగింది.

రెండు సినిమాల బడ్జెట్ లు బిజినెస్ లు వేరు అయినా టాక్ మిక్సుడ్ గానే వచ్చింది, కానీ ఒక సినిమా వాళ్ళు రిలీజ్ తో చేతులు దులుపు కోగా మరో టీం వాళ్ళు మాత్రం రిలీజ్ తర్వాత కూడా సినిమాను చాలా బాగా ప్రమోట్ చేసుకుంటూ సినిమాను సేఫ్ చేస్తున్నారు.

అనుష్క నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ నిశ్శబ్దం 30 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందిన అమెజాన్ ప్రైమ్ కి 23 కోట్లకు అమ్మగా రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమా తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కగా 4 కోట్లకు ఆహా వీడియో వాళ్ళు కొన్నారు.. నిశ్శబ్దం సినిమా కి…

నెగటివ్ టాక్ మరో లెవల్ లో రాగా మొదటి రోజు తర్వాత యూనిట్ లో ఎవ్వరూ సినిమాను పట్టించుకొనే లేదు… దాంతో సినిమా గురించి ఎవ్వరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇక మరో పక్క ఒరేయ్ బుజ్జిగా కూడా బ్యాడ్ రివ్యూ లనే సొంతం చేసుకున్నా కానీ టీం మాత్రం ప్రతీ రోజూ సినిమాను ప్రమోట్ చేస్తూనే వస్తుండటం విశేషం…

దాంతో సినిమాకి ఆహా వీడియో యాప్ లో అద్బుతమైన వ్యూస్ వస్తూ ఉండగా త్వరలో డైరెక్ట్ రిలీజ్ కోసం పెట్టిన డబ్బులను ఆహా వీడియో వాళ్లకి రిటర్న్ ఇవ్వడమే కాకుండా లాభాలు కూడా అందే అవకాశం ఉందని సమాచారం. మొత్తం మీద ఈ రెండు సినిమాలను చూసిన వాళ్ళు 23 కోట్ల సినిమా వల్ల కానిది ఇప్పుడు 4 కోట్ల సినిమా చేసి చూపుతుంది అంటూ మెచ్చుకుంటున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here