బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హాట్రిక్ విజయాలతో మాస్ భీభత్సం సృష్టించి సంచలనం సృష్టించిన తర్వాత రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు డాకు మహారాజ్(Daaku Maharaaj Movie)తో మాస్ రచ్చ చేసింది…సినిమా ఓపెనింగ్స్ వీర లెవల్ లో కుమ్మేసిన తర్వాత…
సంక్రాంతికి వస్తున్నాం సినిమా వలన కొంచం స్లో డౌన్ అయినా కూడా ఓవరాల్ గా డాకు మహారాజ్ బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా సినిమా బ్రేక్ ఈవెన్ ని మాత్రం ఫుల్లుగా అందుకోలేక పోయింది. ఇక రీసెంట్ గా సినిమా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా..
నెట్ ఫ్లిక్స్ లో సినిమా డిజిటల్ రిలీజ్ తర్వాత ఆడియన్స్ నుండి రెస్పాన్స్ అనుకున్న దాని కన్నా కూడా సూపర్ పాజిటివ్ గా ఉండగా, సోషల్ మీడియా మొత్తం సినిమా మాస్ ఎలివేషన్ లు, తమన్ కొట్టిన ఎక్స్ లెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ వీడియోలు సాలిడ్ గా ట్రెండ్ అవుతూ ఉండగా…
మరో పక్క నెట్ ఫ్లిక్స్ లో ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ తో మాస్ రచ్చ చేస్తూ దుమ్ము లేపుతున్న సినిమా నెట్ ఫ్లిక్స్ లో 24 గంటల లోపే టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. తెలుగు ఆడియన్స్ మాత్రమే కాకుండా….
ఇతర సౌత్ భాషల ఆడియన్స్ కూడా సినిమా ను ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తూ ఉండటం విశేషమని చెప్పాలి. కాగా ముఖ్యంగా సినిమా టెక్నికల్ వాల్యూస్ ప్రొడక్షన్ వాల్యూస్ ని అందరూ ఓ రేంజ్ లో పొగుడుతూ ఉండటం విశేషం. ఇక నెట్ ఫ్లిక్స్ లో సినిమా ఎన్ని రోజులు ఇలానే ట్రెండ్ అవుతూ కుమ్మేస్తుందో చూడాలి.