గత ఏడాది వచ్చిన మహానటి ఊహించని విజయం సాధించడం తో తెలుగు లో బయోపిక్స్ పై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగి పోయాయి, ఇక స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ సిరిస్ పై కూడా బజ్ ఓ రేంజ్ లో ఉండటం తో ఈ ఇయర్ సంక్రాంతి కి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం ఖాయమని అంతా భావించారు, కానీ జరిగింది మొత్తం వేరు.
తొలి పార్ట్ పాజిటివ్ టాక్ తోనూ ఊహకందని ఎపిక్ డిసాస్టర్ గా మిగిలి పోగా రెండో పార్ట్ మొదటి పార్ట్ ని మించిన అట్టర్ డిసాస్టర్ గా మారిపోయింది, దాంతో సినిమా ని కొన్న వాళ్ళు అందరు తీవ్ర నష్టాల్లో మునిగిపోయారు, ఓవర్సీస్ బయ్యర్లు కూడా భారీ లాస్ అయ్యారు.
బయోపిక్స్ పై క్రేజ్ ఉండటం, ఎన్టీఆర్ బయోపిక్ అవ్వడం తో ఓవర్సీస్ లో సినిమా బిజినెస్ ఫుల్ జోరు అందుకోగా రెండు పార్టులు కలిపి ఏకంగా 18 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెప్పుకున్నాయి. కానీ మొదటి పార్ట్ మొత్తం మీద ఫైనల్ రన్ లో సాధించిన…
కలెక్షన్స్ అందరికీ షాక్ ఇచ్చాయి… ఎన్టీఆర్ కథా నాయకుడు సినిమా ఫైనల్ రన్ లో ఓవర్సీస్ లో $928,275 మాత్రమె వసూల్ చేసింది, ఇక రెండో పార్ట్ అంతకిమించిన షాక్ ఇస్తూ $216,933 డాలర్స్ ని మాత్రమె వసూల్ చేసింది, రెండు పార్టులు కలిపి కేవలం $1,145,218 వసూల్ చేశాయి.
మొదటి పార్ట్ ఫ్లాఫ్ తో రెండో పార్ట్ బిజినెస్ లో మార్పులు జరిగి టోటల్ బిజినెస్ 14.5 కోట్ల రేంజ్ లో ఉండగా రెండు పార్టులు కలిపి కేవలం 4.5 కోట్ల రేంజ్ షేర్ ని రాబట్టి 10 కోట్ల మేర నష్టాన్ని సొంతం చేసుకుని ఓవర్సీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.