Home గాసిప్స్ ఫస్ట్ డే ఎన్ని కోట్లు వస్తే అన్ని నీకే….ఎన్టీఆర్ కి నయా ఆఫర్ ఇచ్చిన టాలీవుడ్...

ఫస్ట్ డే ఎన్ని కోట్లు వస్తే అన్ని నీకే….ఎన్టీఆర్ కి నయా ఆఫర్ ఇచ్చిన టాలీవుడ్ ప్రొడ్యూసర్

2140
0

     ఇప్పటి వరకు టాలీవుడ్ హీరోల కు బ్లాంక్ చెక్ లు, వాళ్లకి ఓ సినిమా కి ఇచ్చే రెమ్యూనరేషన్ కి మించి ఆఫర్ చేయడం, ఒకేసారి రెండు మూడు సినిమాల కు గుత్త గా మాట్లాడు కోవడం, లేక ఏదైనా ఏరియాల లో వచ్చే కలెక్షన్స్ ని రెమ్యూనరేషన్ గా ఇవ్వడం లాంటివి ఇప్పటి వరకు జరి గాయి. కానీ టాలీవుడ్ హిస్టరీ లో మొదటి సారిగా ఓ స్టార్ హీరోకి నయా ఆఫర్ వచ్చింది.

తన సినిమా తొలి రోజు ఎంత వసూల్ చేస్తే అంత మొత్తాన్ని రెమ్యూనరేషన్ కింద ఇవ్వ డానికి ఓ బడా నిర్మాత ముందు కొచ్చినట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఆ హీరో ఎవరో తెలిసింది కానీ ఆ నిర్మాత ఎవరనేది మాత్రం తెలియరాలేదు.

ఆ హీరో మరెవరో కాదు మూడు వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, 28 సినిమాలు పూర్తి చేసిన ఎన్టీఆర్ తన 29 సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి రాజామౌలి డైరెక్షన్ లో మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత కమింట్ మెంట్స్ పై ఇప్పటి నుండే పోటి మొదలు అయింది.

కాగా ఈ సినిమాకు మాకు చేయాలి అంటే మాకు చేయాలి అంటూ నిర్మాతలు ఎన్టీఆర్ చుట్టూ తిరుగుండటంతో ఓ నిర్మాత పైన చెప్పిన ఆఫర్ ఇచ్చాడట. అరవింద సమేత ఫస్ట్ డే ఏకంగా 26.64 కోట్ల షేర్ తో సంచలన ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది, RRR తర్వాత క్రేజ్ మరింత పెరుగుతుంది.

దాన్నే ఎన్టీఆర్ కి రెమ్యూనరేషన్ గా ఇవ్వాలని ఆ నిర్మాత ఆలోచన. అంటే ఎన్టీఆర్ సై అంటే అవలీలగా 28 నుండి 30 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ ఆఫర్ దక్కడం ఖాయం అని చెప్పాలి. ప్లాన్ బాగానే ఉంది కానీ ఎన్టీఆర్ ఒప్పుకుంటాడా లేదా చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here