బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న సినిమాల్లో సంపత్ నంది డైరెక్షన్ లో తమన్నా(Tamannaah Bhatia) మెయిన్ లీడ్ లో రూపొందిన ఓడెల2(Odela2 Movie) ఒకటి…అప్పట్లో వచ్చిన ఓడెల రైల్వే స్టేషన్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మీడియం రేంజ్ మూవీస్ రేంజ్ లో…
బడ్జెట్ తో రూపొందగా బిజినెస్ పరంగా కూడా మంచి జోరుని చూపించింది. నాన్ థియేట్రికల్ బిజినెస్ తో చాలా మొత్తాన్ని రికవరీ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు థియేట్రికల్ బిజినెస్ పరంగా కూడా కుమ్మేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద సినిమా కి జరిగిన బిజినెస్ లెక్కలను గమనిస్తే…
నైజాంలో 3.5 కోట్లు, సీడెడ్ లో కోటి ఆంధ్రలో 4 కోట్ల దాకా బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా 8.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకున్న సినిమా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కలిపి మరో 2 కోట్ల మేర బిజినెస్ ను సొంతం చేసుకోగా..
టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 10.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకుంది. ఇతర వర్షన్ లను ఓన్ గానే రిలీజ్ చేస్తూ ఉండగా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా 11 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా, బాక్స్ ఆఫీస్ దగ్గర యిప్పుడు సినిమా ఓవరాల్ గా…
12 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. సినిమా మీద డీసెంట్ బజ్ ఉన్నా కూడా జనాలు అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి రావడం లేదు, ఈ సినిమా సీక్వెల్ ఫ్యాక్టర్ తో బజ్ అయితే డీసెంట్ గా…
ఉన్న నేపధ్యంలో బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన తర్వాత టాక్ కొంచం పర్వాలేదు అనిపించేలా ఉంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించడానికి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పాలి. మరి ఈ సినిమాతో తమన్నా తెలుగు లో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.