Home న్యూస్ పడిపడిలేచే మనసు ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

పడిపడిలేచే మనసు ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

0

      శర్వానంద్ సాయి పల్లవి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ పడిపడిలేచే మనసు ప్రేక్షకుల ముందుకు మంచి అంచనాల నడుమ వచ్చేసింది. కాగా సినిమా ముందుగా ఓవర్సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా అక్కడ నుండి సినిమా కి వస్తున్న టాక్ ఎలా ఉందొ తెలుసుకుందాం పదండీ.. ముందుగా కథ విషయానికి వస్తే కోల్కతా నేపధ్యంలో తెరకెక్కిన లవ్ స్టొరీ ఇది. ఇద్దరు కలవడం కొన్ని కారణాల వల్ల విడిపోవడం.

తిరిగి ఎలా కలిసారు అన్నది సినిమా పాయింట్ అంటున్నారు. రొటీన్ కథ నే అయినా మొదటి అర్ధభాగం చాలా వరకు ఎంటర్ టైన్ మెంట్ గా ఉంటూ అలరిస్తుందని లీడ్ పెయిర్ కెమిస్ట్రీ, కోల్కతా లోకేషన్స్, మంచి మ్యూజిక్ అండ్ కొన్ని ఎంటర్ టైన్మెంట్ సీన్స్ తో ఫస్టాఫ్…

చాలా వరకు మెప్పించాగా ఒక ఇంటరెస్టింగ్ పాయింట్ తో ఇంటర్వెల్ ముగిస్తుందని, సెకెండ్ ఆఫ్ మాత్రం అంచనాలను పూర్తీ అందుకోలేక పోయిందని అంటున్నారు. ఫస్టాఫ్ తో పోల్చితే సెకెండ్ ఆఫ్ ట్రీట్ మెంట్ తగ్గి స్లో అయిన ఫీలింగ్ కలుగుతుందని అంటున్నారు.

శర్వానంద్ మరియు సాయి పల్లవి ఇద్దరు తమ పెర్ఫార్మెన్స్ తో మెప్పించినా కానీ సెకెండ్ ఆఫ్ కథ లో దమ్ము అనుకున్న రేంజ్ లో లేకపోవడం తో ఫస్టాఫ్ ఇచ్చిన కిక్ లో సగం మాత్రమె సెకెండ్ ఆఫ్ లో ఉండటం భారీ మైనస్ గా మారింది.

ఓవరాల్ గా సినిమా కి ఓవర్సీస్ ఆడియన్స్ నుండి యావరేజ్ టు ఎబో యావరేజ్ టాక్ లభించింది అని చెప్పాలి. ఇక రెగ్యులర్ షో లకి ఎలాంటి టాక్ లభిస్తుంది అన్న దాని పై సినిమా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని చెప్పొచ్చు, మరి ఎం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here