పొలిటికల్ నేపధ్యంలో సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి అంటే ఆ సినిమాలో ఏదైనా మ్యాజిక్ ఉంటేనే థియేటర్స్ కి జనాలు వస్తే…. ఫిబ్రవరి నుండి వచ్చిన పొలిటికల్ బ్యాగ్ డ్రాప్ మూవీస్ లో భారీ బడ్జెట్ తో వచ్చిన యాత్ర2(Yatra2 Movie Profit Loss Report)…మూవీ డీసెంట్ రివ్యూలను సొంతం చేసుకున్నా కూడా…
పార్ట్ 1 తో పోల్చితే ఏమాత్రం ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించ లేక పోయింది. ఓవరాల్ గా సినిమాను 50 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించగా థియేట్రికల్ బిజినెస్ పెద్దగా జరగలేదు కానీ ఓన్ రిలీజ్ అయినా కూడా వాల్యూ రేంజ్ అటూ ఇటూగా 10 కోట్ల దాకా ఉండగా సినిమా టోటల్ రన్ లో 3.7 కోట్ల రేంజ్ లోనే షేర్ ని అందుకుని నిరాశ పరిచింది.
ఇక ఓవరాల్ బడ్జెట్ 50 కొట్లలో 20 కోట్లకు పైగా మొత్తం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రికవరీ అయినట్లు ట్రేడ్ లో అంచనా…. ఇక థియేట్రికల్ రన్ లో 3.7 కోట్ల దాకా రికవరీ అవ్వడంతో రెండూ కలిపితే ఆల్ మోస్ట్ 24 కోట్ల లోపు రికవరీ సినిమా బడ్జెట్ లో జరిగిందని చెప్పొచ్చు…
దాంతో ట్రేడ్ అంచనాల ప్రకారం సినిమా బడ్జెట్ లో సగానికి పైగా లాస్ ను సొంతం చేసుకుని ఉండొచ్చని చెప్పొచ్చు. సినిమా పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ నే సాధించింది, ఆ టైంలో ఆల్ మోస్ట్ 8.9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఇప్పుడు యాత్ర2 మాత్రం బాక్స్ ఆఫీస్ పరంగా నిరాశ పరిచింది, బడ్జెట్ పరంగా కూడా భారీ నష్టాలనే సొంతం చేసుకుంది.