Home న్యూస్ 1000 కోట్లతో ఆగుతుంది అనుకుంటే….జోరు ఏమాత్రం ఆపని పఠాన్!

1000 కోట్లతో ఆగుతుంది అనుకుంటే….జోరు ఏమాత్రం ఆపని పఠాన్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఆల్ టైం ఎపిక్ రికార్డులను బాలీవుడ్ లో నమోదు చేసి సంచలనం సృష్టించగా 6 వారాలు అవుతున్నా కానీ ఇప్పటికీ కలెక్షన్స్ పరంగా జోరు చూపిస్తూనే దూసుకు పోతున్న ఈ సినిమా కొత్త సినిమాలను ధీటుగా ఎదురుకుంటూ పరుగును సూపర్ స్టడీ గా కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.

సినిమా 1000 కోట్లకు దగ్గర అవుతున్న టైంలో స్లో డౌన్ అవ్వగా ఇక 1000 కోట్ల తర్వాత పరుగు పూర్తీ అవుతుంది అనుకుంటే కొత్త సినిమాలు నిరాశ పరచడంతో ఆడియన్స్ ఇప్పటికీ పఠాన్ మూవీని చూడటానికి ఎగబడుతూనే ఉండటం తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…

మరో 40 కోట్ల గ్రాస్ ను అందుకుని టోటల్ గా 1040 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని ఊచకోత కోసింది. ఇండియాలో హిందీ వర్షన్ నెట్ కలెక్షన్స్ 518 కోట్ల మార్క్ ని అందుకోగా అన్ని వర్షన్ లు కలుపుకుని 536.50 కోట్ల మార్క్ ని అందుకుంది. టోటల్ ఇండియన్ గ్రాస్ లెక్క…

649 కోట్ల మార్క్ ని అందుకోగా ఓవర్సీస్ టోటల్ గ్రాస్ 391 కోట్ల రేంజ్ లో ఉంది… దాంతో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 1040 కోట్ల గ్రాస్ ను అందుకోగా ఇప్పటికీ సినిమా జోరు చూపిస్తూ ఉండటంతో 1050 కోట్ల నుండి 1060 కోట్ల దాకా సినిమా పరుగును కొనసాగినా ఆశ్యర్యపోనవసరం లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here