Home న్యూస్ పెద్దకాపు1 స్పెషల్ షోల టాక్ ఎలా ఉందంటే!!

పెద్దకాపు1 స్పెషల్ షోల టాక్ ఎలా ఉందంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో భారీగా రిలీజ్ అవుతున్న మూవీస్ లో శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పెద్దకాపు1(Peddakapu1) మూవీ ఒకటి… అందరూ కొత్త యాక్టర్స్ తోనే సినిమా తెరకేక్కినా కూడా శ్రీకాంత్ అడ్డాల ప్రీవియస్ మూవీస్ తో…

పోల్చితే కంప్లీట్ గా డిఫెరెంట్ గా ఈ సినిమా రూపొందింది… అసురన్ రీమేక్ నారప్పతోనే ఇలాంటి జానర్ ను ట్రై చేసినా అది రీమేక్ అవ్వగా …ఇప్పుడు పెద్దకాపు1 తో ఫుల్ రా మాస్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు శ్రీకాంత్ అడ్డాల….

కాగా సినిమా మీద యూనిట్ నమ్మకంతో రీసెంట్ గా సినిమా స్పెషల్ షోలను రిలీజ్ కి ముందుగానే కొన్ని సెలెక్టివ్ థియేటర్స్ లో వేయగా అక్కడ నుండి సినిమా కి ఇప్పుడు డీసెంట్ టు గుడ్ రెస్పాన్స్ సొంతం అవుతుంది అని చెప్పాలి. ముఖ్యంగా సినిమాలో మిక్కీ జే మేయర్…

సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్, చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా ఉండటం, శ్రీకాంత్ అడ్డాల మాస్ ఎలిమెంట్స్ ను చాలా బాగా తీయడంతో అసలు క్లాస్ డైరెక్టర్ నుండి ఇలాంటి మాస్ ను ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు అంటున్నారు…

సినిమా స్టోరీ ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నా కూడా ఓవరాల్ టేకింగ్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాటోగ్రఫీ మేజర్ ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు. ఓవరాల్ గా స్పెషల్ షోల నుండి సినిమాకి మంచి టాక్ లభిస్తూ ఉండగా 29న రిలీజ్ అయ్యాక ఎలాంటి రెస్పాన్స్ ను సినిమా సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here