రోబో తర్వాత వరుస పరాజయాలను మూట గట్టుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ మళ్ళీ రోబో 2.0 తో మంచి కంబ్యాక్ చేశాడు, ఇక ఈ ఇయర్ సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు పేట అంటూ వింటేజ్ రజినీ ని మళ్ళీ అభిమానులకు పరిచయం చేసి మెప్పించాడు రజినీ. తమిళ్ లో విశ్వాసం నుండి తీవ్ర పోటి వలన సినిమా మరీ అనుకున్న రేంజ్ లో దుమ్ము లేపక పోయిన కానీ టోటల్ టార్గెట్ ని అందుకుంది.
సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 124 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని సొంతం చేసుకోగా సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ టార్గెట్ 240 కోట్ల లోపు టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా తెలుగు వర్షన్ నిరాశ పరచగా తమిళ్ వర్షన్ పరంగా మాత్రం మొత్తం మీద…
బ్రేక్ ఈవెన్ అయ్యింది. సినిమా బాక్స్ ఆఫీస్ సంక్రాంతి రేసు లో కాకుండా ఒకటి రెండు వారాల తర్వాత తెలుగు లో రిలీజ్ అయ్యి ఉంటె కచ్చితంగా తెలుగు లో కూడా మంచి విజయాన్ని అందుకునేది అని చెప్పొచ్చు. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన…
గ్రాస్ కలెక్షన్స్ ని ఒకసారి పరిశీలిస్తే… Tamil Nadu – 118 Cr, Telugu States – 9.7 Cr, Karnataka – 18.4 Cr, Kerala – 8 Cr, ROI – 5.18 Cr, Overseas – 69.50 Cr Total worldwide gross 228.78Cr. ఇదీ మొత్తం మీద సినిమా సాధించిన గ్రాస్ వివరాలు. కాగా ఇందులో టోటల్ గా షేర్…
115 కోట్ల నుండి 116 కోట్ల దాకా వచ్చిందని అంచనా… తెలుగు వర్షన్ ని పక్కకు పెడితే తమిళ్ వర్షన్ క్లీన్ హిట్ గా నిలిచింది. టోటల్ గా చూసుకుంటే సినిమా సెమీ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. 2.0 మరియు పేట సినిమాలతో బాక్ టు బాక్ హిట్స్ కొట్టి సూపర్ స్టార్ జోరు చూపాడు అని చెప్పాలి.