కాగా ఈవెంట్ లో సినిమా గురించిన ప్రశ్న జవాబులు హాట్ హాట్ గా సాగుతుండగా ఒక విలేకరి అడిగిన ప్రశ్న కి ఎన్టీఆర్ చెప్పిన జవాబు ప్రెస్ మీట్ లో నవ్వుల పూవులు పూయించింది. విలేకరి ఎన్టీఆర్ యమదొంగ తర్వాత అలాగే రామ్ చరణ్ మగధీర సినిమాలు రెండూ…
రాజమౌళి డైరెక్షన్ లోనే వచ్చిన సినిమాలు అని, తర్వాత మళ్ళీ ఫీక్షనల్ స్టొరీ లు అస్సలు చేయలేదు కదా అని అడిగిన ప్రశ్న కి పూర్తీ కాకముందే ఎన్టీఆర్ మైక్ అందుకుని నేను చేశాను కదా అంటూ “శక్తి” సినిమాను మరిచిపోయారు మీరు అంటూ కామెంట్స్ చేశాడు.
ఎంత కంఫర్టబుల్ గా శక్తి ని మర్చిపోయారు మీరు కానీ నేను మాత్రం ఆ సినిమా ను మర్చిపోలేను అంటూ చేసిన కామెంట్స్ కి ప్రెస్ మీట్ లో అందరు తెగ నవ్వేశారు. ఎన్టీఆర్ కెరీర్ లో అప్పట్లో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా భారీ నిరాశనే మిగిలించింది.
తర్వాత కొంతకాలం ఫ్లాఫ్స్ వెక్కిరించినా తిరిగి టెంపర్ నుండి వెనుతిరిగి చూసుకోకుండా కెరీర్ ని బిల్డ్ చేసుకున్నాడు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి చేస్తున్న ఈ సెన్సేషనల్ మూవీ తో వచ్చే ఏడాది ఎలాంటి బాక్స్ ఆఫీస్ రికార్డులు నమోదు చేస్తాడో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.