రానా సాయి పల్లవి ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ విరాట పర్వం, తెలుగు తో పాటు తమిళ్ లో కూడా రిలీజ్ కానున్న ఈ సినిమా ముందు తెలుగు లో రిలీజ్ అవ్వబోతుండగా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సమ్మర్ టైం లో ఆడియన్స్ ముందుకు రావాల్సిన ఈ సినిమా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన రిలీజ్ పోస్ట్ పోన్ లు చేసుకోవాల్సి వచ్చింది. ఇంతలో సినిమా కి డైరెక్ట్ గా…
డిజిటల్ రిలీజ్ చేయించాలని వరుస పెట్టి ఆఫర్స్ కూడా వస్తూ ఉండగా సినిమా మేకర్స్ ఆల్ మోస్ట్ సినిమా రిలీజ్ ను కన్ఫాం చేసినట్లే అంటూ ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు. దానికి 2 కారణాలు కూడా ఉన్నాయట, ఒకటి రేటు భారీగా రావడం రెండోది… థియేటర్స్ తెరచిన తర్వాత ఆల్ రెడీ…
పెండింగ్ ఉన్న మూవీస్ అలాగే థియేటర్స్ తెరచే టైం కి ముందు అనౌన్స్ చేసిన సినిమాల మధ్య పోటి మరింత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ సినిమా కూడా ఆశించిన విధంగా థియేటర్స్ ని దక్కించుకోలేదు కాబట్టి కొన్ని సినిమాలు డైరెక్ట్ రిలీజ్ ను ఎంచుకుంటే బెటర్ అని కొందరు ఫీల్ అవుతున్నారట.
ఈ సినిమా సుమారు 35 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందుతుందని సమాచారం, సమ్మర్ టైం లో రిలీజ్ అనుకున్నప్పుడు ఈ సినిమా కి టోటల్ వరల్డ్ వైడ్ గా 20 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ఆఫర్స్ వచ్చాయి, కానీ డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కి ఏకంగా 30 కోట్ల రేంజ్ లో ఆఫర్ రాగా మేకర్స్ నేగోషియేట్ చేయగా…
రేటు ఫైనల్ గా 32 కోట్లకు ఫైనల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు, నెట్ ఫ్లిక్స్ వాళ్ళు ఈ సినిమా పై ఎక్కువ ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద డిజిటల్ రేటు అదిరిపోయే రేటు సొంతం అయ్యిందని చెప్పొచ్చు. ఇక అఫీషియల్ అప్ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.