క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రంగమార్తాండ సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కానీ ప్రమోషన్స్ అంతలా లేక పోవడంతో కలెక్షన్స్ లిమిటెడ్ గానే ఉంటూ వస్తున్నాయి. కాగా ఈ సినిమా చాలా చిన్న సినిమా అని అందరూ అనుకున్నారు కానీ బడ్జెట్ పరంగా సినిమా కోసం బాగానే ఖర్చు చేశారని తెలుస్తుంది ఇప్పుడు… మొత్తం మీద సినిమా కోసం…
ఆల్ మోస్ట్ 8 కోట్ల మేర ఖర్చు చేశారట. థియేట్రికల్ బిజినెస్ రేంజ్ 2.3 కోట్ల దాకా ఉండగా నాన్ థియేట్రికల్ రైట్స్ లో డబ్బింగ్ అండ్ డిజిటల్ రైట్స్ కలిపి సినిమాకి 6 కోట్ల దాకా రికవరీ అయ్యిందని సమాచారం. ఇక సినిమా కి శాటిలైట్ రైట్స్ ఒక్కటి బాలెన్స్ ఉండగా…
అవి కాకుండా టోటల్ గా బడ్జెట్ మీద 8.3 కోట్ల దాకా రిటర్న్ రాగా పబ్లిసిటీ అండ్ ప్రింట్ ఖర్చులు తో లెక్కలన్నీ సమంగా నిలిచాయి అని అంటున్నారు.. తెలుగు శాటిలైట్ రైట్స్ తో మేకర్స్ కి మొత్తం మీద ప్రాఫిట్ కొంచం దక్కే అవకాశం ఉందని చెబుతూ ఉండగా….
బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సినిమా సగానికి పైగా రికవరీ చేయగా మరికొంత కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మొత్తాన్ని కూడా రికవరీ చేస్తే ఓవరాల్ గా మేకర్స్ కి బయర్స్ కి సినిమా ప్రాఫిటబుల్ గా నిలుస్తుంది అలాగే కృష్ణవంశీకి మంచి కంబ్యాక్ మూవీగా కూడా నిలుస్తుంది. మరి సినిమా లాంగ్ రన్ ఎలా ఉంటుందో చూడాలి.