టాలీవుడ్ లో ప్రతీ ఇయర్ కూడా అనేక సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే అంచనాలను అందుకుంటాయి… ఇక డబ్బింగ్ మూవీస్ విషయానికి వస్తే అడపాదడపా కొన్ని సినిమాలు మాత్రమే తెలుగు లో అంచనాలను అందుకునే రేంజ్ లో విజయలాను సొంతం చేసుకోగా అతి కొద్ది సినిమాలు మాత్రమే ఊహకందని లెవల్ లో అల్టిమేట్ ప్రాఫిట్స్ ను తెచ్చి పెట్టాయి. అలాంటి సినిమాల్లో 2016 లో వచ్చిన బిచ్చగాడు సినిమా…
ఎపిక్ విజయాన్ని నమోదు చేసింది అని చెప్పొచ్చు. కేవలం 45 లక్షల రేటు పెట్టి కొంటే ఏకంగా 16.5 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సాధించి చరిత్ర సృష్టించగా, ఆ సినిమా కన్నా ముందు మరో డబ్బింగ్ మూవీ కూడా ఇలాంటి అరుదైన రికార్డ్ ను నమోదు చేసింది.
ఆ సినిమా నే రంగం సినిమా… రిలీజ్ అయినప్పుడు అసలు ఎవ్వరూ పట్టించుకోని ఈ సినిమా మూడు నాలుగు వారాల తర్వాత టాక్ అంతటా స్ప్రెడ్ అవ్వడం తో అల్టిమేట్ లాంగ్ రన్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర 100 రోజులు ఎక్కువ సెంటర్స్ లో నడిచి సంచలనం సృష్టించింది.
ఈ సినిమా ను కేవలం 55 లక్షల రేటు కి తెలుగు లో అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో అద్బుతమైన కలెక్షన్స్ ను సొంతం చేసుకుని ఏకంగా 12.2 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సాధించి ఊహకందని బ్లాక్ బస్టర్ గా భీభత్సమైన ప్రాఫిట్స్ ను దక్కేలా చేసింది. అలాంటి ఈ సెన్సేషనల్ మూవీ రిలీజ్ అయ్యి…
త్వరలో సినిమాను రీ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మార్చ్ 1 న సినిమాను తమిళ్ వర్షన్ ను రీ రిలీజ్ చేయాలని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. 150 సెంటర్స్ లో 50 రోజుల వేడుకని ఆల్ మోస్ట్ 15 సెంటర్స్ లో 100 రోజులను తెలుగు లో కంప్లీట్ చేసుకుని డబ్బింగ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీ గా ఆ టైం లో సంచలనం సృష్టించింది. తర్వాత ఆ రికార్డ్ ను బిచ్చగాడు సినిమా సాలిడ్ మార్జిన్ తో బ్రేక్ చేసి మరో ఎపిక్ రికార్డ్ ను సాధించింది.
తమిళ్ లో రెస్పాన్స్ ఎలా ఉన్నా కూడా తెలుగు లో కూడా ఈ సమ్మర్ లో సినిమా రీ రిలీజ్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఇప్పుడు రీ రిలీజ్ లో ఎలాంటి మ్యాజిక్ చూపిస్తుందో చూడాలి.