మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చూపి చాలా కాలమే అవుతుంది, రాజా ది గ్రేట్ తర్వాత చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకోగా రవితేజ కొత్త సినిమాల పై మాత్రం నిర్మాతలు భారీ నమ్మకం ఉంచుతున్నారు, ఇప్పుడు రవితేజ కంబ్యాక్ కి సిద్ధం అవుతున్న క్రాక్ సినిమా పై కూడా నిర్మాతలు 34 కోట్ల దాకా బడ్జెట్ పెట్టారు… ఇక ఇప్పుడు…
మాస్ మహారాజ్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ అండ్ ఫస్ట్ లుక్ లు జరిగాయి, రాక్షసుడు తో రీసెంట్ గా హిట్ కొట్టిన రమేష్ వర్మ డైరెక్షన్ లో రవితేజ హీరోగా కొత్త సినిమా కమిట్ అయిన విషయం తెలిసిందే, నేడు సినిమా ఫస్ట్ లుక్ ని రివీల్ చేయగా…
టైటిల్ అనౌన్స్ మెంట్ కూడా చేశారు, ముందుగా లీక్ అయినట్లే సినిమా కి “ఖిలాడీ” అన్న టైటిల్ ని కన్ఫాం చేయగా ఫస్ట్ లుక్ లో రవితేజ ఫుల్ ఎనర్జీ తో కనిపించిన స్టిల్ ని రిలీజ్ చేయగా ఫ్యాన్స్ ఫుల్ కిక్ ఇచ్చింది సినిమా ఫస్ట్ లుక్…
ఇక సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుండగా…. సినిమా పై కూడా భారీ బడ్జెట్ పెట్టబోతున్నారట నిర్మాతలు. ఈ సినిమా బడ్జెట్ సుమారు 35 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందబోతుందని సమాచారం. 4 డిసాస్టర్ మూవీస్ తర్వాత కూడా రవితేజ మీద నిర్మాతలకు ఈ రేంజ్ లో నమ్మకం ఉండటం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.
ఎలాగు సినిమా కి బాక్స్ ఆఫీస్ బిజినెస్ కి తోడూ శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ వాటితో పాటు హిందీ డబ్బింగ్ రైట్స్ భారీగా రేట్లు సొంతం అవుతాయి కాబట్టే నిర్మాతలు రవితేజ మీద కోట్లు పెట్టడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉంటున్నారు, ఇక రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాలతో సాలిడ్ గా కంబ్యాక్ ని సొంతం చేసుకోవాలని మనం కోరుకుందాం…