మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నబా నటేష్ ల కాంబినేషన్ లో డెబ్యూ డైరెక్టర్ సుబ్బు డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అయింది… ఆల్ మోస్ట్ 9 నెలలుగా మూసేసి ఉన్న థియేటర్స్ ని రీ ఓపెన్ చేయించిన ఈ సినిమా టోటల్ ఇండస్ట్రీ సపోర్ట్ తో వస్తుండగా వరల్డ్ వైడ్ గా 550 థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా ఎలా ఉందో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ ఏంటి అనేది ఆల్ రెడీ ట్రైలర్ లో చూపెట్టారు, అదే సినిమా కథ కూడాను… సింపుల్ గా చెప్పాలి అంటే ఆర్ నారాయణ మూర్తిని స్పూర్తిగా తీసుకుని సోలో గా ఉండటమే ఉత్తమం అనుకునే హీరో కి వాళ్ళ మామయ్య రావ్ రమేష్ ఫుల్ సపోర్ట్ చేస్తాడు…
కానీ అనుకోకుండా హీరోయిన్ లైఫ్ లో ఎంటర్ అయ్యాక లైఫ్ ఎలా టర్న్ తీసుకుని అన్నది మొత్తం మీద సినిమా కథ పాయింట్… పెర్ఫార్మెన్స్ పరంగా తన రోల్ మట్టుకు సాయి ధరం తేజ్ కుమ్మేశాడు. ఈజ్ తో నటించి డాన్సుల పరంగా కామెడీ పరంగా కూడా మెప్పించాడు.
ఇక హీరోయిన్ నబా నటేష్ కూడా తన రోల్ వరకు బాగా మెప్పించగా ఇద్దరి పెయిర్ కూడా బాగుంది, ఇక ప్రతి రోజూ పండగే సినిమాలో మాదిరిగా ఇక్కడ కూడా రావ్ రమేష్ క్యారెక్టర్ మరోసారి హైలెట్ అయింది, ఆ పాత్ర చాలా బాగా మెప్పించింది అని చెప్పాలి. ఇక రాజేంద్రప్రసాద్, నరేష్, వెన్నెల కిషోర్, సత్య కూడా ఆకట్టుకున్నారు.
సినిమా కి తమన్ అందించిన మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యింది, సాంగ్స్ అన్ని కూడా మెప్పించగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా మెప్పించింది… ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొంచం వీక్ గా ఉంది, ఫస్టాఫ్ వరకు పడుతూ లేస్తూ సాగినా కానీ సెకెండ్ ఆఫ్ అవసరం లేని సన్నివేశాలు కొన్ని తొలగించి ఉంటె బాగుండేది అనిపిస్తుంది, సినిమాటోగ్రఫీ బాగా మెప్పించాగా, డైలాగ్స్ కూడా బాగా వచ్చాయి….
పంచులు, సింగిల్ లైన్స్ బాగానే మెప్పిస్తాయి… ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగుండగా డైరెక్షన్ పరంగా సుబ్బు మంచి పాయింట్ నే అనుకున్నా పూర్తిగా అనుకున్న విధంగా కన్వే చేయలేక పోయాడు… కొన్ని పాత్రలు మెప్పించినా ఓవరాల్ గా సినిమా పరంగా చూసుకుంటే మట్టుకు ఫస్టాఫ్ యావరేజ్ గా సెకెండ్ ఆఫ్ కొంచం తక్కువగా అనిపిస్తుంది…
ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సాయి ధరం తేజ్ రోల్, రావ్ రమేష్ ల పెర్ఫార్మెన్స్, ఫస్టాఫ్ లో అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్ వర్కౌట్ అవ్వడం, సింగిల్ లైన్ పంచులు, డైలాగ్స్ అండ్ మ్యూజిక్ బిగ్ ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే…
సెకెండ్ ఆఫ్ నరేషన్, వీక్ స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్, సాదాసీదా క్లైమాక్స్ కొంచం మైనస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. మొత్తం మీద సినిమా లో ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి, కొంచం నిరాశ పరిచే అంశాలు ఉన్నాయి, రెండూ సమపాళ్ళలో ఉండటం తో కొంచం ఓపికతో చూస్తె సినిమా పర్వాలేదు….
అనిపించడం మాత్రం ఖాయమని చెప్పొచ్చు. ముందే చెప్పినట్లు సెకెండ్ ఆఫ్ ని కొంచం బెటర్ గా డీల్ చేసి ఉంటె సినిమా మరింత బాగా మెప్పించేది… సినిమా పాండమిక్ తర్వాత రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా అవ్వడం తో సినిమాను థియేటర్స్ లో చూడాలి అని కోరుకుంటూ ఎలాంటి రేటింగ్ ఇవ్వడం లేదు….ఇక బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.