రెండు రాష్ట్రాలలో సినిమాకి స్పెషల్ షోలు భారీ గానే పడ్డాయి. అక్కడ నుండి వినిపిస్తున్న టాక్ కూడా సూపర్ పాజిటివ్ గా ఉండటం విశేషం… అక్షయ్ కుమార్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా హార్ట్ టచింగ్ గా ఉందని వారు చెబుతున్నారు.
ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ మెగా కంబ్యాక్ చేసిన సినిమా గా ఈ సినిమా నిలుస్తుందని చెబుతుండటం విశేషం, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ మామూలు గూస్ బంప్స్ ఇవ్వలేదని ఓ రేంజ్ లో ఈ సీన్స్ కి రెస్పాన్స్ ఉంటుందని వారు చెబుతున్నారు.
సినిమాలో చాలా సీన్స్ హై స్టాండర్డ్ లో తెరకెక్కించి ప్రతీ సీన్ ని హాలివుడ్ రేంజ్ లో ఏమాత్రం తీసి పోనీ విధంగా శంకర్ టేకింగ్ అదిరి పోయిందని అంటున్నారు. సినిమా విజువల్స్ మరింతగా ఎంజాయ్ చేయాలి అంటే కచ్చితంగా 3 D లోనే సినిమాను చూసి తీరాలి అంటున్నారు.
ఓవరాల్ గా సినిమాకి అటు ప్రీమియర్ షోల నుండి ఇటు స్పెషల్ మార్నింగ్ షోల వరకు కూడా సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ లభించింది అని చెప్పొచ్చు. ఈవినింగ్ నైట్ షోల కి ఇదే రేంజ్ మెయిన్ టైన్ అయితే బాక్స్ ఆఫీస్ ను ఈ సినిమా ఓ రేంజ్ లో షేక్ చేయడం ఖాయమని చెప్పొచ్చు.