బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సంక్రాంతికి భారీ లెవల్ లో వచ్చిన విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ సినిమాగా వచ్చిన సైంధవ్(Saindhav Movie) మిగిలిన సినిమాల రేసులో ఏమాత్రం జోరుని చూపించ లేక పోయింది. దాంతో వీకెండ్ లో తప్పితే సినిమా తర్వాత ఏమాత్రం జోరు చూపించలేదు…
దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ త్వరగానే కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అవ్వగా అక్కడ కూడా సినిమాకి రెస్పాన్స్ ఏమాత్రం అనుకున్న విధంగా లేదు, సినిమా ఎక్కడా కూడా ఆకట్టుకోలేక పోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కి భారీగానే నష్టాలు సొంతం అవ్వగా….
థియేట్రికల్ రన్ లో భారీ నష్టాలను సొంతం చేసుకున్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కొద్ది వరకు బాగానే సొంతం అయ్యాయని తెలుస్తుంది. కాగా సినిమా డిజిటల్ రైట్స్ కింద ఓవరాల్ గా మంచి బిజినెస్ నే సొంతం చేసుకుంది. సినిమా డిజిటల్ రైట్స్ ను ఈటీవీ మరియు అమెజాన్ ప్రైమ్ వాళ్ళు సొంతం చేసుకోగా…
రెండు రైట్స్ కలిపి ఆల్ మోస్ట్ 10 కోట్ల రేంజ్ లో రేటుని సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు. శాటిలైట్ రైట్స్ లెక్కలు క్లియర్ గా ఏమి బయటికి రాలేదు కానీ ఉన్నంతలో వాటితో కూడా కలుపుకుని ఓవరాల్ గా సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కింద 15 కోట్లకు అటూ ఇటూగా బిజినెస్ సొంతం చేసుకుందని అంటున్నారు.
ఇతర భాషల నాన్ థియేట్రికల్ రైట్స్ తో కలిపి సినిమా 22 కోట్లకు పైగా బిజినెస్ ను సొంతం చేసుకుందని సమాచారం. బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయ్యి ఉంటే పండగ టైంలో మంచి కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉన్నప్పటికీ సినిమా ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది అని చెప్పాలి.