Home న్యూస్ సలార్-దేవర-కల్కి 2 వారాల ముందు ప్రీ బుకింగ్స్…దేవర మాస్ భీభత్సం!

సలార్-దేవర-కల్కి 2 వారాల ముందు ప్రీ బుకింగ్స్…దేవర మాస్ భీభత్సం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా వచ్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీస్ లలో ప్రభాస్(Prabhas) నటించిన సినిమాలే ఎక్కువగా ఉండగా ఓపెనింగ్స్ నుండి మంచి రన్ ను సొంతం చేసుకున్న సినిమాలుగా సలార్(Salaar) మరియు కల్కి(Kalki 2898 AD) సినిమాల తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తున్న బిగ్ పాన్ ఇండియా మూవీ అయిన…

ఎన్టీఆర్(Jr NTR) నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రిలీజ్ కి 4 వారాల నుండి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా, ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో దేవర సినిమా మాస్ రచ్చ చేస్తూ ఊచకోత కోస్తుంది ఇప్పుడు….

మొత్తం మీద ఆల్ రెడీ రిలీజ్ అయిన 2 బిగ్ పాన్ ఇండియా మూవీస్ సలార్-కల్కి సినిమాల 2 వారాల ముందు అమెరికాలో ప్రీ బుకింగ్స్ తో ఒకసారి దేవర బుకింగ్స్ ను కంపేర్ చేస్తే సలార్ మూవీ 2 వారాల ముందు అమెరికాలో 360 లోకేషన్స్ లో బుకింగ్స్ ఓపెన్ అవ్వగా….

21 వేలకు పైగా టికెట్ సేల్స్ తో 6 లక్షలకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా, తర్వాత కొంత గ్యాప్ లో రిలీజ్ అయిన కల్కి మూవీ రిలీజ్ కి 2 వారాల ముందు ప్రీ బుకింగ్స్ పరంగా 475 కి పైగా లోకేషన్స్ లో ఆల్ మోస్ట్ 33 వేలకు పైగా టికెట్ సేల్స్ తో…

1.06 మిలియన్ డాలర్స్ కి పైగా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు దేవర మూవీ రెండు వారాల ముందు రిలీజ్ టైంకి 450 కి పైగా లోకేషన్స్ లో ఆల్ మోస్ట్ 38 వేలకు పైగా టికెట్ సేల్స్ తో ఏకంగా 1.2 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది.

షోల పరంగా గ్రాస్ పరంగా కల్కి కన్నా కూడా చాలా బెటర్ గా ప్రస్తుతానికి అమెరికాలో జోరు చూపిస్తున్న దేవర మూవీ ఇదే జోరుని రిలీజ్ కి ముందు వరకు కొనసాగిస్తే ప్రీమియర్స్ తో మాస్ రికార్డ్ ను నమోదు చేసే అవకాశం ఉంది, ఇక టాక్ కూడా బాగుంటే లాంగ్ వీకెండ్ లో కలెక్షన్స్ భీభత్సం సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here