నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడియన్స్ ముందుకు మరికొన్ని గంటల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉండగా సినిమాకి ఆంధ్రలో ఉన్న పరిస్థితుల వలన గట్టి ఎదురుదెబ్బ తగిలింది అనే చెప్పాలి. ఆ ఇంపాక్ట్ వలన థియేటర్స్ కూడా చాలా తక్కువ గానే సొంతం చేసుకున్న శ్యామ్ సింగ రాయ్ సినిమా ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ ని ఒకసారి గమనిస్తే…
ఆల్ రెడీ మూడు రోజుల ముందే సినిమా బుకింగ్స్ స్టార్ట్ అయినా అది ఎక్కువ శాతం నైజాం వరకే జరగగా ఆంధ్రలో టికెట్ రేట్స్ ఇష్యూ వలన బుకింగ్స్ చాలా తక్కువగానే పెట్టారు. చాలా ఏరియాల్లో సినిమా రిలీజ్ రోజునే బుకింగ్స్ ఓపెన్ కాబోతుండటం విచారకరం.
పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నా ఓవరాల్ గా బుకింగ్స్ ఓపెన్ చేసిన సెంటర్స్ లో 30% కి పైగా ఆన్ లైన్ బుకింగ్స్ ఓవరాల్ గా సొంతం అయ్యాయి. దాంతో సినిమా ఎక్కువ శాతం ఇప్పుడు మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి ఆడియన్స్ ముందుకు రాబోతుంది అని చెప్పాలి.
ఇక ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ ని అలాగే ఫస్ట్ డే షో షో కి కలెక్షన్స్ స్టడీగా ఇంప్రూవ్ మెంట్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా సినిమా ఇనీషియల్ ఓపెనింగ్స్ లెక్క 4.5 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర షో షో కి కలెక్షన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళితే మొదటి రోజు లెక్క 5 కోట్ల నుండి మొత్తం మీద…
5.5 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఈ కలెక్షన్స్ రీసెంట్ టైం లో నాని కెరీర్ లో లోవేస్ట్ ఓపెనింగ్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి సినిమా ఈ కలెక్షన్స్ ని మించి వసూళ్ళని మొదటి రోజు కనుక సొంతం చేసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాలిడ్ ఓపెనింగ్స్ గా భావించవచ్చు. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.