నాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ మరి కొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా సినిమా కి ఆంధ్రలో ఎదురు అయిన పరిస్థితుల ఇంపాక్ట్ వలన లెక్కలు అన్నీ మారిపోయాయి. సినిమా ను ముందుగా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న టైం లో ఓవరాల్ గా 30 కోట్లకు పైగా బిజినెస్ ను సినిమా సొంతం చేసుకుందని వార్తలు చక్కర్లు కొట్టగా…
ఇప్పుడు మారిన పరిస్థితుల వలన సినిమా నిర్మాతలు సినిమాను అన్ని చోట్లా తామే ఓన్ గా రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. దాంతో ఇక సినిమా బిజినెస్ లాంటివి ఏమి లేకుండా బాక్స్ ఆఫీస్ టార్గెట్ లేకుండా బరిలోకి దిగుతుంది అని చెప్పాలి. ఇక సినిమా కి….
తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా సొంతం అయిన థియేటర్స్ కౌంట్ కూడా చాలా తక్కువగా ఉండటం అందరినీ ఆశ్యర్యపరిచింది. సినిమా ఇప్పుడు నైజాంలో కేవలం 152 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా సీడెడ్ లో 70 థియేటర్స్ లో ఆంధ్రలో 200 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది…
రీసెంట్ టైం లో నాని కెరీర్ లోనే ఇది ఆల్ టైం లోవెస్ట్ థియేటర్స్ కౌంట్ గా చెప్పుకోవాలి. ఓన్ రిలీజ్ కాబట్టి ఎన్ని థియేటర్స్ కుదిరితే అన్నే ఇవ్వగలిగారు… ఇక ఆంధ్రలో కొన్ని థియేటర్స్ ని మూసేయడం లాంటివి కూడా సినిమాకి ఇబ్బంది పెట్టగా టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 425 థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న సినిమా… ఓవరాల్ గా సౌత్ లో ఇతర భాషల్లో…
అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 250 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా ఓవర్సీస్ మొత్తం మీద 300 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ థియేటర్స్ కౌంట్ ఇప్పుడు 975 వరకు ఉంటుందని సమాచారం. మొదటి షో టైం కి లెక్క 1000 వరకు ఉండే అవకాశం ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.