బాక్స్ ఆఫీస్ దగ్గర 9 నెలల తర్వాత థియేటర్స్ ని రీ ఓపెన్ చేయించి ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించిన మొదటి సినిమా గా నిలిచిన మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా మొదటి వారాన్ని ఘనంగా ముగించడానికి సిద్ధం అవుతూ ఉండగా మరో పక్క వారం ఎండ్ అయ్యే టైం లో సినిమా గురించిన ఓ షాకింగ్ అప్ డేట్ తో….
షాక్ ఇచ్చారు జీ నెట్ వర్క్ వాళ్ళు…. సినిమాను గంపగుత్తుగా ఏకంగా 38 కోట్ల భారీ రేటు కి కొన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రేటు కి సినిమా ని మాత్రం థియేట్రికల్ బిజినెస్ పరంగా వరల్డ్ వైడ్ గా 9.2 కోట్లకు మాత్రమే అమ్మారు. దాంతో మిగిలిన అమౌంట్ ని…
ఎలా రికవరీ చేసుకుంటారు అన్న డౌట్ ఉన్నప్పటికీ శాటిలైట్, డిజిటల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ లాంటివి కలిపి 38 కోట్లకు 29 కోట్లు రికవరీ అవ్వవు కాబట్టి సినిమా ను ఇప్పుడు మొదటి వారం తర్వాత పే పెర్ వ్యూ పద్దతిలో జీ ప్లేక్స్ యాప్ లో రిలీజ్ చేయబోతున్నామని అనౌన్స్ చేశారు.
ఒకపక్క సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతుంది, మొదటి వారం తర్వాత బ్రేక్ ఈవెన్ కానున్న సినిమా ఇప్పుడు జీ ప్లేక్స్ లో పే పెర్ వ్యూ పద్దతిలో టికెట్ 149 రేటు తో రిలీజ్ కానుంది. దాంతో అది థియేట్రికల్ రన్ పై ఎఫెక్ట్ చూపే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. ఈ పద్దతిలో ఎంత వస్తే అంత బెటర్ అని జీ నెట్ వర్క్ భావిస్తుందట.
రేటు ఎక్కువ పెట్టడంతో వేరే దారిలేక ఇలా రికవరీ కి సడెన్ గా ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరో పక్క సోషల్ మీడియా లో ఇలా డైరెక్ట్ రిలీజ్ చేయాలనీ భావించినప్పుడు సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయడం ఎందుకని కౌంటర్లు పడుతున్నాయి. ఇక ఇలా పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ అయిన తర్వాత సినిమా రెండు చోట్ల కలెక్షన్స్ ని ఎలా బాలెన్స్ చేస్తుందో చూడాలి.