2013 టైంలో ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న మహేష్ బాబు, వెంకటేష్ ల కాంబోలో రూపొందిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(Seethamma Vakitlo Sirimalle Chettu Movie) ఆల్ మోస్ట్ 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు రీ రిలీజ్ కి సిద్ధం అవుతుంది…
ఈ వీకెండ్ లో గ్రాండ్ గా రీ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా..కంప్లీట్ అన్ సీజన్ లో స్టూడెంట్స్ కి పరీక్షలు అవుతున్న తరుణంలో రీ రిలీజ్ అవుతూ ఉండటంతో జనాలు సినిమాను పట్టించుకుంటారా… చూడటానికి థియేటర్స్ కి వస్తారో రారో అన్న అనుమానాలు ఉన్నప్పటికీ కూడా…
అవన్నీ పటాపంచలు చేస్తూ ఇప్పుడు రీ రిలీజ్ బుకింగ్స్ ట్రెండ్ ఎక్స్ లెంట్ జోరుతో దూసుకు పోతూ ఉండటం అందరినీ ఆశ్యర్యపరుస్తుంది. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసి 2 రోజులు కాగా రెండు రోజుల్లో ఎక్స్ లెంట్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా…
మొదటి రోజు 20.3 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజు 15.15 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా టోటల్ గా 2 రోజుల టికెట్ సేల్స్ లెక్క 35.45 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ఉండగా సినిమా రిలీజ్ కి ఇంకా…
3 రోజుల టైం ఉండగా ఓవరాల్ గా బుకింగ్స్ సాలిడ్ గా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. అన్ సీజన్ లో ఇది ఎక్స్ లెంట్ ట్రెండ్ అని చెప్పాలి ఇప్పుడు…బుకింగ్స్ లోనే కాదు మేజర్ సెంటర్స్ లో సినిమా కి ఆల్ రెడీ వీకెండ్ వరకు మెయిన్ థియేటర్స్ లో…
షోలు హౌస్ ఫుల్ అవ్వడం అందరినీ మరింత ఆశ్యర్యపరుస్తుంది. నార్మల్ టైం లో అయితే వేరు కానీ ఇప్పుడు అన్ సీజన్ లో పరీక్షలు జరుగుతున్నా ఈ సినిమా బుకింగ్స్ ట్రెండ్ సాలిడ్ గా ఉండటం చూస్తుంటే రీ రిలీజ్ లో సినిమా మంచి కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.