క్లాస్ మూవీతో సంక్రాంతి పండగ టైంలో ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఊచకోత కోస్తున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతుంది. సినిమా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో…
ఓవరాల్ గా 46.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది….ఇక వరల్డ్ వైడ్ గా 65.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఇక మూడో రోజు సినిమా స్క్రీన్ కౌంట్ ని పెంచుకోగా అన్ని చోట్లా ఓ రేంజ్ లో కలెక్షన్స్ భీభత్సం సృష్టించి మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు…
ఆల్ మోస్ట్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రలలో మరోసారి 20 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఈ గ్రాస్ 21 కోట్ల మార్క్ ని కూడా దాటే అవకాశం ఎంతైనా ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ లో కూడా…
మరోసారి మంచి హోల్డ్ ని చూపించిన నేపధ్యంలో టోటల్ గా 3వ రోజున వరల్డ్ వైడ్ గా మరోసారి 25 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఈ కలెక్షన్స్ తో సినిమా టోటల్ గా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 67 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా…
వరల్డ్ వైడ్ గా సినిమా 90 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకోబోతుంది. ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 42.50 కోట్ల ని జస్ట్ రెండున్నర రోజుల్లోనే బ్రేక్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓవరాల్…
టాలీవుడ్ తరుపున 2025 ఇయర్ లో ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ని దాటేసి క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాగా నిలిచింది. ఇక మీదట వచ్చేవన్నీ కూడా లాభాలే కాబట్టి లాంగ్ రన్ లో సినిమా అల్టిమేట్ లాభాలతో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.