శర్వానంద్ మరియు సమంత ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ స్టొరీ జాను రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే, సినిమా కి మినిమమ్ 3 స్టార్ రేటింగ్ అందరూ ఇవ్వగా కలెక్షన్స్ పరంగా మాత్రం ఆ రేటింగ్ ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేక పోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ తర్వాత సినిమా చేతులు ఎత్తేయగా మొదటి వారం పూర్తీ అయిన తర్వాత…
ఇప్పుడు రెండో వీకెండ్ లో అయినా పుంజుకుంటుందా అని అనుకుంటే జస్ట్ యావరేజ్ అనిపించే కలెక్షన్స్ తోనే సరిపెట్టుకుంది సినిమా. సినిమా 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 19 లక్షల షేర్ ని వరల్డ్ వైడ్ గా 22 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది.
10 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే
?Nizam: 7L
?Ceeded: 1.3L
?UA: 2.4L
?East: 2L
?West: 1.1L
?Guntur: 2L
?Krishna: 2L
?Nellore: 1L
AP-TG Total:- 0.19CR
ఇక సినిమా టోటల్ గా 10 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 2.83Cr
?Ceeded: 87L
?UA: 1.17Cr
?East: 47L
?West: 36L
?Guntur: 61L
?Krishna: 51L
?Nellore: 23L
AP-TG Total:- 7.05CR??
Ka & ROI: 0.45Cr
OS: 0.88Cr
Total WW: 8.38CR(14.80Cr Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 10 రోజులకు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలు.
సినిమాను టోటల్ గా 18.5 కోట్లకు అమ్మగా 19.2 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ గా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 10.82 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటేనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. అది దాదాపు అసాధ్యమే అవ్వడంతో సినిమా డిసాస్టర్ రిజల్ట్ కన్ఫాం అయినట్లే అని చెప్పాలి.