బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి మార్చ్ నెలలు అన్ సీజన్ లు గా చెప్పుకుంటారు…ఈ టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యే సినిమాల పెర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగానే ఉంటాయి….ఈ టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర జనాలను థియేటర్స్ కి రప్పించడం కొంచం కష్టమే…. కానీ ఈ టైంలో జనాలను బాక్స్ ఆఫీస్ దగ్గరకి….
రెండు ఇండస్ట్రీలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస పెట్టి దుమ్ము లేపుతూ దూసుకు పోతున్నాయి. ఒకటి బాలీవుడ్ కాగా మరోటి మాలీవుడ్….ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీ అయితే బాక్ టు బాక్ హిట్స్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ తో దుమ్ము లేపుతూ ఉండగా మరో పక్క బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మరీ సూపర్ హిట్స్ పడక పోయినా…
సాలిడ్ గా అన్ని సినిమాలకు కలెక్షన్స్ సొంతం అవుతూ ఉన్నాయని చెప్పాలి…. కానీ ఇదే టైంలో ఇటు టాలీవుడ్ అలాగే కోలివుడ్ ఇండస్ట్రీల నుండి మాత్రం హిట్స్ అయితే పడటం లేదు అనే చెప్పాలి. కోలివుడ్ అయితే సంక్రాంతి నుండే సరైన హిట్ లేకుండా మంచి హిట్ కోసం ఇప్పటికీ ఎదురు చూస్తూ ఉండగా….
టాలీవుడ్ సంక్రాంతి కి జోరు చూపించిన తర్వాత ఫిబ్రవరి నుండి ఆశించిన సక్సెస్ అయితే సొంతం అవ్వలేదు, ఇక శాండల్ వుడ్ అయితే మాత్రం ఇంకా మంచి విజయాలను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది… మొత్తం మీద మలయాళ ఇండస్ట్రీ అలాగే బాలీవుడ్ లో సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఉండగా మరో పక్క మిగిలిన ఇండస్ట్రీల వాళ్ళు సైలెంట్ గా హిట్స్ కోసం ఎదురు చూస్తున్నారు….