టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ గత రెండు మూడు ఏళ్ళుగా రాజ్యం ఏలుతున్న విషయం తెలిసిందే…వరుస పెట్టి చాలా సినిమాలే రీ రిలీజ్ అవ్వగా అందులో కొన్ని సినిమాలు మాత్రమే అంచనాలను మించి రచ్చ చేశాయి. అందులో కూడా మహేష్ బాబు(Mahesh Babu) నటించిన సినిమాల రచ్చ…
మరో లెవల్ లో దుమ్ము లేపగా… 12 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(Seethamma Vakitlo Sirimalle Chettu Movie) సినిమా క్లాసిక్ విజయాన్ని అందుకోగా రీసెంట్ గా సినిమాను గ్రాండ్ గా రీ రిలీజ్ చేయగా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో….
మాస్ రచ్చ చేసిన ఈ సినిమా టోటల్ రన్ లో అంచనాలను మించి వసూళ్ళని సొంతం చేసుకుంది. ఏకంగా 6.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని రీ రిలీజ్ లో సొంతం చేసుకుని దుమ్ము లేపిన ఈ సినిమా మహేష్ కెరీర్ లో రెండో 6 కోట్ల గ్రాస్ మూవీ గా నిలిచింది.
అలాగే టాలీవుడ్ ఆల్ టైం టాప్ రీ రిలీజ్ మూవీస్ లో ఆల్ టైం టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా సౌత్ మూవీస్ లో ఆల్ టైం టాప్ 5 ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఒకసారి టాప్ రీ రిలీజ్ మూవీస్ టోటల్ రన్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Re Release Movies Top Total Collections Report
👉#Ghilli4K – 32.50CR~
👉#Murari4K – 8.90Cr
👉#GabbarSingh4K – 8.01CR~
👉#Kushi – 7.46CR~
👉#SVSC Re Release – 6.60CR****
👉#BusinessMan4K – 5.85Cr~
👉#Devadoothan(Malayalam) – 5.3CR+
👉#Spadikam(Malayalam) – 4.90CR~
👉#Orange4K– 4.71Cr(2nd Re Release – 1.35CR)
👉#Simhadri4K – 4.60CR
👉#EeNagaranikiEmaindi – 3.52CR~
👉#SuryaSonOfKrishnan – 3.40Cr~
👉#Indra4K – 3.38CR
👉#Orange4K– 3.36Cr
మొత్తం మీద అంచనాలను మించి దుమ్ము దుమారం లేపిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అల్టిమేట్ రచ్చని అన్ సీజన్ లో చేయగా హాలిడే వీకెండ్ లో కనుక రిలీజ్ చేసి ఉంటే రచ్చ మరో లెవల్ లో ఉండేదని చెప్పాలి…ఇక టాలీవుడ్ తరుపున టాప్ రికార్డ్ కూడా మహేష్ మురారి మీదే ఉండగా ఫ్యూచర్ లో ఈ రికార్డ్ ను ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి.