మార్చ్ లో థియేటర్స్ అన్నీ మూత బడగా అప్పటి నుండి ఎప్పుడెప్పుడు థియేటర్స్ రీ ఓపెన్ చేస్తారా అని సినీ లవర్స్ అందరూ ఆశగా ఎదురు చూసినప్పటికీ కూడా కరోనా తగ్గక పోవడం తో అది అలా సాగుతూ పోయింది… ఆల్ మోస్ట్ 9 నెలలు థియేటర్స్ మూసేసి ఉండగా అందులో కొన్ని థియేటర్స్ ని కంప్లీట్ గా మూసేశారు, ఇలాంటి టైం లో థియేటర్స్ కి జనాలను తిరిగి రప్పించడానికి సిద్ధం అయిన సినిమా…
సోలో బ్రతుకే సో బెటర్… థియేటర్స్ రీ ఓపెన్ అయినా జనాలను థియేటర్స్ రప్పించే సినిమా ఏవి లేక పోవడం తో రిస్క్ చేసి ఇప్పుడు ఈ సినిమాను సాయి ధరం తేజ్ రిలీజ్ చేస్తూ ఉండగా సినిమా కి సపోర్ట్ గా టోటల్ టాలీవుడ్ ముందుకు రావడం మరో విశేషం అని చెప్పాలి.
ఆల్ మోస్ట్ అందరూ సెలబ్రిటీలు కూడా తమ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో సినిమా గురించి మాట్లాడుతూ థియేటర్స్ కి తిరిగి రండి అంటూ ట్వీట్స్ పెట్టి సినిమా ను మరింతగా ప్రమోట్ చేస్తున్నారు. దాంతో ఫ్యాన్స్ నువ్వా నేనా అనుకోకుండా థియేటర్స్ కి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు.
ఈ విషయంలో టాలీవుడ్ ఇతర ఇండస్ట్రీలకు కూడా ఆదర్శంగా నిలిచింది అని చెప్పాలి… కోలివుడ్ లో బాలీవుడ్ లో ఆల్ రెడీ సినిమాలు రిలీజ్ లు మొదలు అయినా నోటబుల్ మూవీస్ ఏవి కూడా రిలీజ్ అవ్వడానికి సిద్ధం కాలేదు. రిలీజ్ అయిన చిన్న చితకా సినిమాలకు పెద్దగా సపోర్ట్ ఏమి లభించలేదు కూడాను… ఇలాంటి టైం లో టాలీవుడ్ నుండి పెద్ద సినిమా రిలీజ్ అవుతూ ఉండటం…
ఆ సినిమా కి టోటల్ టాలీవుడ్ స్టార్స్ అండ్ టెక్నికల్ టీం అందరూ సపోర్ట్ గా ఉండటం తో ఇతర ఇండస్ట్రీలు టాలీవుడ్ ను చూసి నేర్చుకోవాలి అంటూ మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ సాధించే కలెక్షన్స్ ని బట్టి తర్వాత ఒకటి తర్వాత ఒకటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.