Home TRP రేటింగ్ అమ్మింది 5 కోట్లకు….కాంచన3 TRP రేటింగ్ తెలిస్తే షాక్!!

అమ్మింది 5 కోట్లకు….కాంచన3 TRP రేటింగ్ తెలిస్తే షాక్!!

1085
0

     ఈ ఇయర్ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాఘవ లారెన్స్ నటించిన కాంచన సిరీస్ లోని కొత్త సీక్వెల్ కాంచన 3 యావరేజ్ రివ్యూ లతోనే సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధించి తెలుగు లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 10 కోట్ల బిజినెస్ కి 20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని దుమ్ము లేపిన ఈ సినిమా తర్వాత జీ తెలుగు వారు 5 కోట్ల దాకా రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ ని కొన్నారు.

రీసెంట్ గా టెలికాస్ట్ అయిన ఈ సినిమా కి బుల్లి తెరపై కూడా మంచి TRP రేటింగ్ దక్కిందని చెప్పొచ్చు. సినిమా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు 13.10 TRP రేటింగ్ ని సొంతం చేసుకుంది, ఇది రీసెంట్ టైం లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ TRP రేటింగ్ లలో ఒకటిగా చెప్పుకోవాలి.

అందునా డబ్బింగ్ తెలుగు మూవీస్ పరంగా ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ TRP రేటింగ్ లలో ఒకటిగా చెప్పుకోవాలి. యావరేజ్ రివ్యూ లతో వెండితెరపై సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా ఇప్పుడు బుల్లితెర పై కూడా మంచి TRP రేటింగ్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది.

కాగా ఈ సినిమా ను 5 కోట్లకు కొన్న జీ తెలుగు వారికి తొలి టెలికాస్ట్ కే చాలా మొత్తం రికవరీ అయినట్లు సమాచారం. ఇక రెండో సారి టెలికాస్ట్ అయ్యే సమయానికి పూర్తీ లాభాలతో ఉంటారని అంటున్నారు. వరుస పెట్టి ఎన్ని సీక్వెల్స్ వస్తున్నా కనీ ఈ సిరీస్ కి…

అటు తమిళ్ లో ఇటు తెలుగు లో కూడా మంచి ఫాలోయింగ్ ఉండటం తో టాక్ కి అతీతంగా కలెక్షన్స్ అలాగే బుల్లి తెరపై కూడా మంచి TRP రేటింగ్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది ఈ సిరీస్. త్వరలోనే మరో కొత్త సీక్వెల్ ని మొదలు పెట్టె పనిలో ఉన్నాడట లారెన్స్. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here