Home TRP రేటింగ్ సినిమా ఏం బాలేదు అన్నారు…TRP మాత్రం దంచికొట్టింది!

సినిమా ఏం బాలేదు అన్నారు…TRP మాత్రం దంచికొట్టింది!

0

నాచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ టక్ జగదీష్ సినిమా పై రిలీజ్ కి ముందు సాలిడ్ అంచనాలు ఉండేవి, సినిమా టీసర్ అద్బుతంగా ఉండటం తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడు రిలీజ్ అయినా కానీ నాని కి MCA రేంజ్ లో హిట్ ని సొంతం చేసి పెట్టేది అనిపించే రేంజ్ లో అంచనాలు పెంచిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత కొంచం మిక్సుడ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ…

సినిమా బాగుంటుంది అన్న ఆశలు ఉండగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్ బాగానే ఉన్నప్పటికీ స్టొరీ పరమ రొటీన్ గా ఉండటంతో సినిమా బాలేదు అంటూ సోషల్ మీడియా లో టాక్ ఓ రేంజ్ లో స్ప్రెడ్ అయింది… అయినా కానీ ఈ టాక్…

ఏమి సినిమా సెన్సేషనల్ వ్యూవర్ షిప్ ను ఆపలేకపోయాయి. అమెజాన్ ప్రైమ్ లో సినిమా కి అల్టిమేట్ వ్యూవర్ షిప్ సొంతం అవ్వగా తర్వాత సినిమా శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఛానెల్ మంచి రేటు చెల్లించి సొంతం చేసుకోగా రీసెంట్ గా సినిమాను టెలివిజన్ లో టెలికాస్ట్ చేశారు…

కాగా సినిమా ఆల్ రెడీ బాలేదు అన్న టాక్ ఉండటం తో TRP రేటింగ్ ఏమంత ఆశించిన విధంగా రాదేమో అని అంతా అనుకున్నారు కానీ కట్ చేస్తే సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ కే సాలిడ్ TRP రేటింగ్ ను సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసింది అని చెప్పాలి. సినిమా కి మొదటి సారి టెలికాస్ట్ లో 10.90 రేటింగ్ సొంతం అయ్యింది.

డిజిటల్ లో రిలీజ్ అయిన మూవీస్ కి టెలివిజన్ లో ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ రేటింగ్ లలో ఒకటిగా చెప్పుకోవాలి. ఆ రేంజ్ లో దుమ్ము లేపిన టక్ జగదీష్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పండగ సీజన్ లో రిలీజ్ అయ్యి ఉంటే మంచి రిజల్ట్ వచ్చేదేమో కానీ డిజిటల్ లో రిలీజ్ అవ్వడంతో థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ మిస్ చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here