Home న్యూస్ ఊర్వశివో రాక్షసివో ఫస్ట్ డే కలెక్షన్స్!!

ఊర్వశివో రాక్షసివో ఫస్ట్ డే కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లు శిరీష్ మరియు అను ఎమాన్యుయల్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఊర్వశివో రాక్షసివో సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో బెటర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఎంటర్ టైన్ మెంట్ విషయం లో బాగానే ఆకట్టుకుంది అని చెప్పాలి. దాంతో మౌత్ టాక్ బాగానే స్ప్రెడ్ అయినా కానీ తొలిరోజు….

ఓపెనింగ్స్ విషయంలో సినిమా జస్ట్ ఓకే అనిపించుకునే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో 40 నుండి 45 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటుంది అనుకోగా మొత్తం మీద సినిమా అటూ ఇటూగా…

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 55 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల గ్రాస్ 85 లక్షల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ గా 1 కోటి రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.

సినిమా ఓవరాల్ వాల్యూ బిజినెస్ రేంజ్ 7 కోట్ల రేంజ్ లో ఉండగా 7.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి రోజు కలెక్షన్స్ కాకుండా సినిమా ఇంకా 6.95 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సి ఉంటుంది. రెండో రోజు బెటర్ బుకింగ్స్ ఉండటంతో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here